యాప్నగరం

రషీద్ హిట్టింగ్ ఆశ్చర్యపరచలేదు: పఠాన్

సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలనం రషీద్ ఖాన్ హిట్టింగ్ తమని ఏమీ ఆశ్చర్యపరచలేదని ఆ జట్టు ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్ వెల్లడించాడు. కోల్‌కతా

Samayam Telugu 26 May 2018, 1:20 pm
సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలనం రషీద్ ఖాన్ హిట్టింగ్ తమని ఏమీ ఆశ్చర్యపరచలేదని ఆ జట్టు ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్ వెల్లడించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శుక్రవారం రాత్రి జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ (34 నాటౌట్: 10 బంతుల్లో 2x4, 4x6) ఆఖర్లో చెలరేగి జట్టుకి 174 పరుగుల భారీ స్కోరు అందించాడు. కోల్‌కతా స్పిన్నర్ల జోరుతో 18.1 ఓవర్లు ముగిసే సమయానికి 138/7తో నిలిచిన హైదరాబాద్ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ.. చివరి రెండు ఓవర్లలో రషీద్ ఖాన్ ఎడాపెడా బౌండరీలు బాదేసి జట్టుని మెరుగైన స్థితిలో నిలిపాడు. మ్యాచ్‌లో ఇదే కీలక మలుపుకాగా.. బంతితోనూ రషీద్ ఖాన్ (3/19)తో మెరిశాడు. దీంతో ఆఖరికి 14 పరుగుల తేడాతో ఓడిన కోల్‌కతా టోర్నీ నుంచి నిష్క్రమించగా.. హైదరాబాద్ జట్టు ఆదివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో వాంఖడే వేదికగా ఫైనల్లో ఢీకొట్టనుంది.
Samayam Telugu ..


రషీద్ ఖాన్ బ్యాటింగ్ ప్రదర్శన మిమ్మల్ని ఆశ్చర్యపరిచిందా..? అని యూసఫ్ పఠాన్‌ని ప్రశ్నించగా.. ‘రషీద్ ఖాన్ చాలా ప్రతిభ ఉన్న క్రికెటర్. బిగ్‌బాష్, ఇతర విదేశీ లీగ్స్‌లో రషీద్ మెరుగ్గా బ్యాటింగ్ చేస్తుంటాడు. అతనిలో ఆ సామర్థ్యం ఉంది కాబట్టే.. 8వ స్థానంలో బ్యాటింగ్‌కి వస్తాడు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లోనూ అతను రెండు చూడచక్కని సిక్సర్లు బాదాడు. కాబట్టి.. అతని బ్యాటింగ్‌ సామర్థ్యంపై మాకు ఎలాంటి అనుమానాలు లేవు. అందుకే ఆ హిట్టింగ్‌ మమ్మల్ని ఏమీ ఆశ్చర్యపరచలేదు’ అని యూసఫ్ పఠాన్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.