యాప్నగరం

IPLలో రెండో అన్‌క్యాప్డ్ ప్లేయర్.. పడిక్కల్ సరికొత్త రికార్డ్

Royal Challengers Bangalore యువ బ్యాటింగ్ సంచలనం దేవదత్ పడిక్కల్ ఐపీఎల్‌లో 400కిపైగా రన్స్ చేసిన రెండో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు.

Samayam Telugu 29 Oct 2020, 4:50 pm
ఐపీఎల్ కారణంగా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన ఎందరో క్రికెటర్లు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారు. ఎంతో మంది యువ ఆటగాళ్ల జీవితాలను ఐపీఎల్ మార్చేసిందంటే అతిశయోక్తి కాదు. గత 13 ఏళ్లుగా అనామకులుగా ఐపీఎల్‌లో అడుగుపెట్టిన హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా లాంటి చాలా మంది యువ క్రికెటర్లు.. తర్వాత సూపర్ స్టార్లుగా మారారు. ఈ సీజన్లో నటరాజన్, రవి బిష్ణోయ్, రియాన్ పరాగ్ లాంటి క్రికెటర్లు మెరుస్తున్నారు.
Samayam Telugu Padikkal
Devdutt Padikkal (PTI Photo/Sportzpics for BCCI)


ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ సత్తా చాటుతున్నాడు. ఆర్సీబీ తరఫున 12 మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా బరిలో దిగిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. 417 రన్స్ చేశాడు. ఆడిన తొలి ఐపీఎల్‌ సీజన్లోనే 400కిపైగా రన్స్ చేసిన రెండో అన్‌క్యాప్డ్ ప్లేయర్ పడిక్కల్ కావడం విశేషం. 2015లో అప్పటి ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున తొలి సీజన్ ఆడిన శ్రేయాస్ అయ్యర్.. 439 రన్స్ చేశాడు. ఆడిన తొలి ఐపీఎల్ సీజన్లోనే 400కిపైగా రన్స్ చేసిన 8వ భారత బ్యాట్స్‌మెన్‌గా పడిక్కల్ రికార్డ్ క్రియేట్ చేశాడు.

ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై హాఫ్ సెంచరీ పడిక్కల్.. ఐపీఎల్‌లో ఆడిన తొలి నాలుగు మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకూ ఐపీఎల్‌లో 4 అర్ధ శతకాలు నమోదు చేసిన పడిక్కల్.. కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే సింగిల్ డిజిట్ స్కోరు చేశాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 45 బంతుల్లో 74 రన్స్ చేసిన బెంగళూరును ఆదుకున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.