యాప్నగరం

IPL 2021 Eliminatorలో తేలిపోయిన బెంగళూరు.. KKR టార్గెట్ 139

కోల్‌కతా నైట్‌రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ దెబ్బకి బెంగళూరు టాప్ ఆర్డర్ విలవిలలాడింది. తొలుత కోహ్లీని బౌల్డ్ చేసిన నరైన్ ఆ తర్వాత భరత్.. డివిలియర్స్, మాక్స్‌వెల్‌ని ఔట్ చేసేశాడు.

Samayam Telugu 11 Oct 2021, 9:37 pm

ప్రధానాంశాలు:

  • ఎలిమినేటర్‌లో తేలిపోయిన బెంగళూరు టాప్ ఆర్డర్
  • నాలుగు వికెట్లు పడగొట్టిన కోల్‌కతా స్పిన్నర్ నరైన్
  • ఒకే తరహాలో కోహ్లీ, ఏబీ డివిలియర్స్ బౌల్డ్
  • మాక్స్‌వెల్, భరత్ కూడా ఫెయిల్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu KKR vs RCB (Pic Credit: IPLT20.com)
ఐపీఎల్ 2021 సీజన్ ఎలిమినేటర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మెన్‌లు నిరాశపరిచారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో షార్జా వేదికగా సోమవారం జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీమ్ 7 వికెట్ల నష్టానికి 138 పరుగులే చేయగలిగింది. టీమ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ (39: 33 బంతుల్లో 5x4) టాప్ స్కోరర్‌‌గా నిలవగా.. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ నాలుగు వికెట్లు, లూకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు తీశారు.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ అనూహ్యంగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. కోహ్లీతో కలిసి బెంగళూరు ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన దేవదత్ పడిక్కల్ (21: 18 బంతుల్లో 2x4) ఇన్నింగ్స్ 5వ ఓవర్‌లో ఫెర్గూసన్ బంతిని అంచనా వేయలేక ఔటైపోయాడు. అనంతరం వచ్చిన తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ (9: 16 బంతుల్లో) బంతిని కనీసం మిడిల్ కూడా చేయలేకపోయాడు. అలానే ఏబీ డివిలియర్స్ (11: 9 బంతుల్లో 1x4), గ్లెన్ మాక్స్‌వెల్‌ (15: 18 బంతుల్లో 1x4) కూడా మిడిల్ ఓవర్లలో పరుగులు రాబట్టలేకపోయారు. మొత్తంగా కోహ్లీ, భరత్, డివిలియర్స్, మాక్స్‌వెల్‌ని బ్యాక్ టు బ్యాక్ ఓవర్లలో సునీల్ నరైన్‌ ఔట్ చేసేయడం గమనార్హం. చివర్లో షబాజ్ అహ్మద్ (13: 14 బంతుల్లో 1x4), డానియల్ క్రిస్టియాన్ (9: 8 బంతుల్లో 1x4), హర్షల్ పటేల్ (8 నాటౌట్: 6 బంతుల్లో 1x4) తక్కువ స్కోరుతో సరిపెట్టారు. దాంతో.. బెంగళూరు 138 పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.