యాప్నగరం

IPL 2020లో SRH బౌలర్ చెత్త బౌలింగ్.. కౌల్ అన్న హాఫ్ సెంచరీ అంటూ ఫ్యాన్స్ ట్రోలింగ్

Mumbai Indiansతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలోనే 64 పరుగులిచ్చిన సిద్ధార్థ్ కౌల్‌ను ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు.

Samayam Telugu 4 Oct 2020, 5:59 pm
షార్జా వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే రోహిత్ శర్మ (6) ఔటైనా.. క్వింటన్ డికాక్ (39 బంతుల్లో 67) రాణించాడు. ఆఖర్లో హార్దిక్ పాండ్య (19 బంతుల్లో 28), కీరన్ పోలార్డ్ (13 బంతుల్లో 25), కృనాల్ పాండ్య (4 బంతుల్లో 20) చితగ్గొట్టడంతో ముంబై 200కిపైగా రన్స్ చేసింది.
Samayam Telugu siddharth kaul | Image: IPL/BCCI


గాయం కారణంగా భువనేశ్వర్ కుమార్ ఈ మ్యాచ్‌‌‌కు దూరం కాగా.. అతడి స్థానంలో సందీప్ శర్మ బౌలింగ్‌కు దిగగా.. ఖలీల్ అహ్మద్ బదులు సిద్ధార్థ్ కౌల్ ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడాడు. నటరాజన్ (4 ఓవర్లలో 29 రన్స్), సందీప్ శర్మ (4 ఓవర్లలో 41/2) మెరుగ్గా బౌలింగ్ చేయగా.. సిద్ధార్థ్ కౌల్ 4 ఓవర్లలో ఏకంగా 64 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.
కౌల్ వేసిన ఇన్నింగ్స్ 20వ ఓవర్లో తొలి బంతికి పోలార్డ్ సింగిల్ తీయగా.. రెండో బంతికి హార్దిక్ పాండ్య బౌల్డ్ అయ్యాడు. తమ్ముడి స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కృనాల్ పాండ్య.. చివరి నాలుగు బంతులను 6,4,4,6గా మలవడంతో.. ఆ ఓవర్లో 21 రన్స్ రావడంతోపాటు ముంబై 208 పరుగులు చేయగలిగింది.
ఈ సీజన్లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న బౌలర్‌ స్టెయిన్‌ (57)ను కౌల్ తొలి మ్యాచ్‌లోనే దాటేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న బౌలర్ల జాబితాలో ఆరోస్థానానికి చేరుకున్నాడు. అందరూ ట్రోల్ చేసే అశోక్ దిండా (63 రన్స్)ను సైతం కౌల్ దాటేశాడు. భారీగా పరుగులు ఇచ్చిన సిద్ధార్థ్ కౌల్‌పై సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ముంబై ఇండియన్స్ తరఫున సెకండ్ హయ్యస్ట్ స్కోర్ చేశావన్నా అంటూ.. సెటైర్లు వేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.