యాప్నగరం

IPL: బుమ్రా కంటే సందీప్ శర్మ మెరుగైన బౌలర్.. ఈ గణాంకాలే సాక్ష్యం!

టీ20ల్లో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. కానీ బుమ్రాతోపాటే ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన సందీప్ శర్మ.. ముంబై ఇండియన్స్ పేసర్ కంటే మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ.. అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు.

Samayam Telugu 4 Nov 2020, 3:28 pm
ముంబై ఇండియన్స్‌పై పది వికెట్ల తేడాతో విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020 ప్లేఆఫ్‌కు చేరింది. వార్నర్, సాహా జోడి అజేయంగా 150 పరుగులు జోడించారు. కానీ ఈ మ్యాచ్‌లో ముంబైని తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో సందీప్ శర్మ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన సందీప్ శర్మ.. రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, ఇషాన్ కిషన్‌లను పెవిలియన్ చేర్చాడు. దీంతో ముంబై 149 రన్స్‌కే పరిమితమైంది.
Samayam Telugu sandeep sharma-bumrah
Images Source: IPL/BCCI


ఐపీఎల్‌లో 90 మ్యాచ్‌లు ఆడిన సందీప్ శర్మ.. 108 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో ఎదురులేని బౌలర్‌గా పేరొందిన జస్ప్రీత్ బుమ్రా కంటే సందీప్ శర్మ ఐపీఎల్‌లో ఎక్కువగా వికెట్లు తీయడం గమనార్హం.

బుమ్రా, సందీప్ ఇద్దరూ 2013లో ఐపీఎల్‌లో అడుగుపెట్టారు. కానీ బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బౌలర్లలో ఒకడిగా మారగా.. సందీప్ శర్మ సాధించిన ఘనతలు మాత్రం పెద్దగా పరిగణనలోకి రాలేదు. కానీ గణాంకాల పరంగా చూస్తే.. బుమ్రా కంటే సందీప్ శర్మ మెరుగ్గా ఉండటం గమనార్హం.

13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మరే బౌలర్‌కు సాధ్యం కాని రీతిలో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు (53) తీసిన బౌలర్‌గా సందీప్ రికార్డ్ క్రియేట్ చేశాడు. 52 వికెట్లు తీసిన జహీర్ ఖాన్‌ను సందీప్ శర్మ వెనక్కి నెట్టాడు.

జస్ప్రీత్ బుమ్రా:
మ్యాచ్‌లు: 90
వికెట్లు: 105
సగటు: 24.22
ఎకానమీ: 7.46
స్ట్రైక్ రేట్: 19.4

సందీప్ శర్మ:
మ్యాచ్‌లు: 90
వికెట్లు: 108
సగటు: 24.02
ఎకానమీ: 7.75
స్ట్రైక్ రేట్: 18.6

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.