యాప్నగరం

MS Dhoni వల్లే అని చెప్పను కానీ.. అంపైర్ వైడ్ కాల్ వివాదంపై డేవిడ్ వార్నర్ స్పందన!

Umpire Wide Call వివాదంపై సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. ధోనీ బాడీ లాంగ్వేజ్ చూశాకే అంపైర్ మనసు మార్చుకున్నాడని స్పష్టం చేశాడు.

Samayam Telugu 17 Oct 2020, 8:52 pm
చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో అంపైర్ వైడ్ కాల్ వివాదంపై సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. కెప్టెన్ల ఫ్రస్టేషన్ అంపైర్ల నిర్ణయంపై ప్రభావం చూపుతోందని వార్నర్ అభిప్రాయపడ్డాడు. గత మంగళవారం చెన్నై, హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చివరి ఓవర్లో.. శార్దుల్ ఠాకూర్ వేసిన బంతి వికెట్లకు దూరంగా వెళ్లగా.. అంపైర్ పాల్ రైఫిల్ ఔటిచ్చేందుకు చేతులు పైకెత్తాడు. కానీ ధోనీ హావభావాలను గమనించి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.
Samayam Telugu dhoni umpire wide call
Image: IPL/Screengrab


ధోనీ అలా ఆగ్రహంగా కనిపించడం అరుదైన విషయం. దీంతో ఈ విషయం పెద్ద చర్చకు దారి తీసింది. మహీ తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. ఈ విషయమై వార్నర్ స్పందిస్తూ.. ‘‘ఆ రోజు ధోనీ వైడ్ ఫ్ట్రస్టేషన్‌కు గురయ్యాడని నాకు తెలుసు. కానీ నిజం ఏంటంటే అంపైర్ వైడ్ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కానీ తనకు ఎదురుగా ఉన్న కెప్టెన్ ధోనీ బాడీ లాంగ్వేజ్‌ను చూశాక అంపైర్ తన మనసు మార్చుకున్నాడు.

ధోనీ వల్లే ఇలా జరిగిందని నేను చెప్పడం లేదు. కానీ వికెట్ల వెనుక మహీ ఉన్నాడు కాబట్టి అంపైర్‌కు కనిపిస్తుంటాడు. ధోనీ ఫ్రస్టేషన్‌ను బయటపెట్టాడు. అలాంటి సమయాల్లో అందరం అలాగే చేస్తాం. కెప్టెన్లు అసహనాన్ని వ్యక్తపర్చడం సాధారణమే. కానీ అంపైర్లు తమ నిర్ణయం తాము తీసుకుంటారు. ఆ నిర్ణయాన్ని మనమంతా గౌరవించాలి. ఈ విషయంలో వాదించడం అనవసరం’’ అని వార్నర్ స్పష్టం చేశాడు.

వైడ్ కాల్స్, నోబాల్స్ విషయంలో అంపైర్ల తప్పుడు నిర్ణయం తీసుకుంటుండంతో.. అంపైర్ల నిర్ణయాన్ని సమీక్షించాలని కోరే అధికారాన్ని ఆటగాళ్లకు ఇవ్వాలని కోహ్లి సూచించగా.. ఈ విషయమై వార్నర్ విబేధించాడు. దీని వల్ల సమయం వృథా అవుతుందని, ఫలితంగా ఆట ఆలస్యం అవుతుందని.. లక్షల్లో నష్టం వాటిల్లుతుందన్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.