యాప్నగరం

6, 4, 6, 6, 6తో పూరన్ విధ్వంసం.. ఐపీఎల్ 2020లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ

సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌‌లో పంజాబ్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ ఒంటరి పోరాటం చేశాడు. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా దూకుడుగా ఆడి ఈ సీజన్లో ఫాస్టెస్ట్ 50 నమోదు చేశాడు.

Samayam Telugu 9 Oct 2020, 12:04 am
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ అదరగొట్టాడు. 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని ఈ ఐపీఎల్ సీజన్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున 2018లో కేఎల్ రాహుల్ ఢిల్లీపై 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయగా.. పూరన్ తర్వాతి స్థానంలో నిలిచాడు.
Samayam Telugu pooran | Image: BCCI


ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన అబ్దుల్ సమద్‌ను టార్గెట్ చేసిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్.. వరుసగా 6, 4, 6, 6, 6 బాదాడు. దీంతో ఆ ఓవర్లో 28 రన్స్ రావడంతోపాటు.. పూరన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పూరన్‌కు ఐపీఎల్‌లో ఇది తొలి అర్ధ శతకం కావడం విశేషం.

ఈ మ్యాచ్‌లో ఐదు ఫోర్లు, ఏడు సిక్సులు బాది 37 బంతుల్లోనే 77 రన్స్ చేసిన పూరన్.. రషీద్ ఖాన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మిగతా బౌలర్లతో ఆటాడుకున్న పూరన్.. రషీద్ ఓవర్లో సింగిల్ తీసే అవకాశం వచ్చినా తీయకుండా.. నాలుగు బంతులను చక్కగా ఎదుర్కొన్నాడు. కానీ ఐదో బంతికి నటరాజన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో కాసేపటికే పంజాబ్ ఆలౌటయ్యింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.