యాప్నగరం

కోహ్లీ సాహసం.. రూ. 10 కోట్ల బౌలర్‌‌ని పక్కన పెట్టిన RCB

ఐపీఎల్ 2020 సీజన్ ఆటగాళ్ల వేలంలో అన్ని ఫ్రాంఛైజీలతో పోటీపడి మరీ రూ. 10 కోట్లకి క్రిస్‌మోరీస్‌ని బెంగళూరు కొనుగోలు చేసింది. కానీ.. ఫస్ట్ మ్యాచ్‌లోనే అతడ్ని కోహ్లీ పక్కన పెట్టేశాడు.

Samayam Telugu 21 Sep 2020, 8:32 pm
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో దుబాయ్‌ వేదికగా సోమవారం రాత్రి జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తుది జట్టు ఎంపికలో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాడు. మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. బెంగళూరు తుది జట్టులో పార్థీవ్ పటేల్‌, మొయిన్ అలీ, క్రిస్‌ మోరీస్‌లకి కనీసం చోటు కూడా దక్కలేదు.
Samayam Telugu Virat Kohli


undefined

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్: అరోన్ ఫించ్, పడ్డికల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఏబీ డివిలియర్స్, జోస్ ఫిలిప్పీ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ, డేల్ స్టెయిన్, చాహల్


వాస్తవానికి ఐపీఎల్ 2020 సీజన్ ఆటగాళ్ల వేలంలో దక్షిణాఫ్రికాకి చెందిన ఆల్‌రౌండర్ క్రిస్‌మోరీస్‌ని రూ. 10 కోట్లు వెచ్చించి మరీ బెంగళూరు టీమ్ కొనుగోలు చేసింది. కానీ.. ఫస్ట్ మ్యాచ్‌లో అతనికి కెప్టెన్ కోహ్లీ చోటివ్వకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఫస్ట్ పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్లలోనూ బౌలింగ్ చేయగల క్రిస్‌మోరీస్.. మిడిల్ ఓవర్లలో హిట్టింగ్ చేయగలడు. అయినప్పటికీ.. అతడ్ని కోహ్లీ పక్కన పెట్టడంపై ఆర్సీబీ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.


ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 61 మ్యాచ్‌లాడిన క్రిస్‌ మోరీస్ 517 పరుగులు చేయడంతో పాటు 69 వికెట్లు కూడా పడగొట్టాడు. బౌలింగ్‌లో అతని బెస్ట్ 4/23కాగా.. బ్యాటింగ్‌లో అత్యధిక స్కోరు 82 పరుగులు కావడం గమనార్హం.



తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.