యాప్నగరం

వార్నర్ స్థానంలో ఇంగ్లాండ్ ఓపెనర్

ఐపీఎల్‌కు దూరమైన డేవిడ్ వార్నర్ స్థానంలో సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ ఇంగ్లాండ్ ఓపెనర్‌ను ఎంపిక చేసుకుంది.

Samayam Telugu 31 Mar 2018, 1:54 pm
డేవిడ్ వార్నర్ స్థానంలో ఇంగ్లాండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రకటించింది. బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాదిపాటు నిషేధం విధించింది. దీంతో మరో వారంలో ప్రారంభం కానున్న ఐపీఎల్‌కు అతడు దూరమయ్యాడు. వార్నర్ స్థానంలో ఇప్పటికే సన్‌రైజర్స్ విలియమ్సన్‌ను కెప్టెన్‌గా ప్రకటించింది. భువనేశ్వర్ కుమార్‌కు వైస్ కెప్టెన్సీ కట్టబెట్టింది.
Samayam Telugu అలెక్స్ హేల్స్


హేల్స్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకూ 52 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 31.65 సగటుతో 1456 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతోపాటు, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో సెంచరీ సాధించిన ఏకైక ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఇతడే కావడం విశేషం. కుడి చేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన హేల్స్ ఐపీఎల్‌లో శిఖర్ ధావన్‌తో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.