యాప్నగరం

పంజాబ్‌పై ప్రతీకారం తీర్చుకున్న హైదరాబాద్

ఐపీఎల్ 2018 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ జట్టుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రతీకారం తీర్చుకుంది. వారం క్రితం మొహాలిలో పంజాబ్ చేతిలో ఓడిన

Samayam Telugu 26 Apr 2018, 11:40 pm
ఐపీఎల్ 2018 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ జట్టుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రతీకారం తీర్చుకుంది. వారం క్రితం మొహాలిలో పంజాబ్ చేతిలో ఓడిన హైదరాబాద్ జట్టు.. గురువారం రాత్రి ఉప్పల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 133 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని 13 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
Samayam Telugu 7


తొలుత కెప్టెన్ కేన్ విలియమ్సన్ (0), ఓపెనర్ శిఖర్ ధావన్ (11), సాహా (6), విఫలమైనా మనీశ్ పాండే (54: 51 బంతుల్లో 3x4, 1x6), షకీబ్ అల్ హసన్ (28: 29 బంతుల్లో 3x4), యూసఫ్ పఠాన్ (21 నాటౌట్: 19 బంతుల్లో 1x4, 1x6) నిలకడగా ఆడటంతో హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.

ఛేదనలో పంజాబ్ ఓపెనర్లు కేఎల్ రాహుల్ (32: 26 బంతుల్లో 4x4, 1x6) , క్రిస్‌గేల్ (23 నాటౌట్: 21 బంతుల్లో 1x4, 2x6) నిలకడగా ఆడి జట్టుకి మెరుగైన ఆరంభమిచ్చినా.. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమవడంతో.. పంజాబ్ 19.2 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది.. సన్‌రైజర్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ (3/19), షకీబ్ అల్ హసన్ (2/18) పంజాబ్ మిడిలార్డర్‌ని ఉక్కిరి బిక్కిరి చేశారు. ఆ జట్టులో ఆరుమంది బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమవడం కొసమెరుపు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.