యాప్నగరం

SRH vs RCB: కీలక మ్యాచ్‌కు ముందు.. విలియమ్సన్ vs వార్నర్ సరదా పోరు.. ఎవరు గెలిచారంటే?

IPL 2020 Eliminatorకి ముందు సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కీలక బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ సరదాగా డార్ట్ గేమ్ ఆడారు. చివర్లో పుంజుకున్న కేన్.. ఈ పోరులో గెలిచాడు.

Samayam Telugu 5 Nov 2020, 1:38 pm
ఐపీఎల్ 2020లో కీలక దశలో పుంజుకున్న సన్‌రైజర్స్ మూడు వరుస విజయాలతో ప్లేఆఫ్ చేరుకున్న సంగతి తెలిసిందే. లీగ్ కీలక దశకు చేరే కొద్దీ సన్‌రైజర్స్ ఆటగాళ్లు ఒత్తిడి తగ్గించుకోవడం కోసం సరదాగా గడుపుతున్నారు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌‌కు ముందు ‘కేన్ కేఫ్‌’కు వెళ్లిన వార్నర్, బెయిర్‌స్టోలకు విలియమ్సన్ చక్కటి ఆస్ట్రేలియా కాఫీ కలిపి ఇచ్చిన సంగతి తెలిసిందే.
Samayam Telugu Warner-Williamson
Image: IPL


ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు కెప్టెన్ డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ డార్ట్ గేమ్ ఆడారు. ఇద్దరూ చిన్న యారోస్‌తో డార్ట్ బోర్డ్‌కు గురి పెట్టి విసిరారు. తొలుత వార్నర్ ముందంజలో ఉండగా.. కూల్‌గా ఆడిన విలియమ్సన్.. డార్ట్ బోర్డ్‌పై ఫోకస్ పెట్టి 8-8తో వార్నర్‌ను సమం చేశాడు. తర్వాతి యారోను గురి చూసి సరిగ్గా మధ్యలోకి విసరిన విలియమ్సన్ విజేతగా నిలిచాడు. విలియమ్సన్‌, వార్నర్ ఇద్దరూ ఒకినొకరు పోత్సహించుకుంటూ సరదాగా ఈ డార్ట్ గేమ్ ఆడారు.

ఈ వీడియోను సన్‌రైజర్స్ ట్వీట్ చేయగా.. ఆర్సీబీతో కీలక మ్యాచ్‌కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ చేయకుండా ఇలా సరదాగా గడుపుతున్నారేంటని కొందరు ఫ్యాన్స్ ప్రశ్నించారు. కేన్ మామా తర్వాతి మ్యాచ్‌ల్లో నీ సత్తా చూపించు.. వార్నర్, మనీష్ భారీ ఇన్నింగ్స్ ఆడారు.. నువ్వు కూడా భారీ ఇన్నింగ్స్ ఆడమని అభిమానులు విలియమ్సన్‌ను కోరుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.