యాప్నగరం

బతికిపోయా.. అంపైర్‌ను వాటేసుకున్న రైనా

రాజస్థాన్‌, చెన్నై జట్ల మధ్య శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సరదా సన్నివేశం చోటు చేసుకుంది. రనౌట్ ప్రమాదం నుంచి బయట పడిన రైనా.. వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లిన అంపైర్‌ను హత్తుకున్నాడు.

Samayam Telugu 12 May 2018, 1:20 pm
రాజస్థాన్‌, చెన్నై జట్ల మధ్య శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ పదో ఓవర్లో రనౌట్ ప్రమాదం నుంచి బయట పడిన రైనా.. వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లిన అంపైర్‌ను హత్తుకున్నాడు. జయదేవ్ ఉనద్కత్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన రైనా వేగంగా సింగిల్ తీయడానికి ప్రయత్నించాడు. బంతిని అందుకున్న రహానే వికెట్ల వైపు విసిరాడు. బాల్ వికెట్లను తాకకపోవడంతో ఈ లెఫ్ట్ హ్యాండర్ బతికిపోయాడు.
Samayam Telugu RAINA UMPIRE


రనౌట్ నుంచి తప్పించుకోవడం కోసం వేగంగా పరిగెత్తుకొచ్చిన రైనా.. స్పీడ్ కంట్రోల్ చేసుకోలేక ఎదురుగా ఉన్న అంపైర్ మారియస్ ఎరాస్మస్‌ను వాటేసుకున్నాడు. దీంతో అంపైర్‌తోపాటు అందరూ నవ్వుకున్నారు.

ఈ మ్యాచ్‌లో రైనా 35 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఆరు ఫోర్లు, ఒక సిక్స్ బాది ఇష్ సోధీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఈ సీజన్లో 313 పరుగులు చేసిన రైనా తద్వారా.. 11 సీజన్లలో 300కిపైగా రన్స్ చేసిన తొలి ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పాడు. టీ20 క్రికెట్లో 150 క్యాచ్‌లు అందుకున్న తొలి భారత ఆటగాడిగానూ రైనా రికార్డు క్రియేట్ చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.