యాప్నగరం

IPL 2023లో రోహిత్ శర్మ ఫెయిల్యూర్‌కి అసలు కారణం చెప్పిన సెహ్వాగ్

Rohit Sharma ఐపీఎల్ 2023 సీజన్‌లో ఫెయిల్యూర్‌కి అసలు కారణం అతని బ్యాటింగ్‌లో సమస్య కాదని వీరేంద్ర సెహ్వాగ్ తేల్చేశాడు. ఫామ్ కోల్పోవడంతో హిట్‌మ్యాన్ ఒత్తిడికి గురవుతున్నాడని చెప్పుకొచ్చిన సెహ్వాగ్.. షాట్ సెలక్షన్‌ కూడా మెరుగ్గా ఉండటం లేదని పెదవి విరిచాడు.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 9 May 2023, 4:49 pm

ప్రధానాంశాలు:

  • ఐపీఎల్ 2023లో రోహిత్ శర్మ ఫెయిల్
  • 10 మ్యాచ్‌లాడి చేసింది ఒక్క హాఫ్ సెంచరీనే
  • హిట్‌మ్యాన్ షాట్ సెలక్షన్‌పై సెహ్వాగ్ పెదవి విరుపు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Rohit Sharma
రోహిత్ శర్మ
ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్‌లో ముంబయి ఇండియన్స్ (MI) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఘోరంగా విఫలమవుతున్నాడు. సీజన్‌లో ఇప్పటికే 10 మ్యాచ్‌లాడిన హిట్‌మ్యాన్ చేసిన పరుగులు కేవలం 184 మాత్రమే. ఇందులో ఒకే ఒక హాఫ్ సెంచరీ ఉండగా.. గెలిపించే ఇన్నింగ్స్ ఒక్కటీ లేదు. ఈ ప్రభావం ముంబయి ఇండియన్స్ జట్టుపై కూడా పడుతోంది. దాంతో టీమ్ 10 మ్యాచ్‌లాడి గెలిచింది ఐదింట్లోనే. ఈ నేపథ్యంలో పాయింట్ల పట్టికలోనూ ముంబయి జట్టు 8వ స్థానంలో కొనసాగుతోంది.
రోహిత్ శర్మ ఫెయిల్యూర్ గురించి భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ ‘‘ఐపీఎల్ 2023 సీజన్‌లో రోహిత్ శర్మ ప్రత్యర్థి బౌలర్లతో పోటీపడటం లేదు. తనతో తనే పోటీపడుతున్నాడు. దానికి కారణం అతని మానసిక ఒత్తిడి. వాస్తవానికి అతని బ్యాటింగ్ టెక్నిక్‌లో ఎలాంటి సమస్య లేదు. అయితే.. షాట్ సెలక్షన్‌లో మాత్రం తికమకకి గురవుతున్నాడు’’ అని చెప్పుకొచ్చాడు. చెన్నైతో ఇటీవల చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్‌కి సింపుల్‌గా రోహిత్ శర్మ వికెట్ ఇచ్చేశాడు.

ఒత్తిడి, ఫామ్ లేమి కారణంగా చెన్నైతో మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఓపెనర్‌గా ఆడలేదు. నెం.3లో బ్యాటింగ్‌కి వచ్చాడు. కానీ షాట్ సెలక్షన్‌లో మళ్లీ అదే తడబాటు. దీపక్ చాహర్ విసిరిన బంతిని వైడ్ లైన్‌పైకి వెళ్లి మరీ స్వ్కేర్ లెగ్ దిశగా హిట్ చేసేందుకు రోహిత్ శర్మ ప్రయత్నించాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి స్లిప్‌లో గాల్లోకి లేచిపోయింది. దాంతో జడేజా సింపుల్‌గా క్యాచ్ అందుకున్నాడు.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.