యాప్నగరం

సన్‌రైజర్స్, చైన్నై క్వాలిఫైయర్ మ్యాచ్ రద్దయితే..?

ఒకవేళ వర్షం లేదా ఇతర కారణాల వల్ల అనుకోని పరిస్థితుల్లో ముంబైలో జరగనున్న తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ రద్దయితే.. ఏమవుతుందో తెలుసా..?

Samayam Telugu 21 May 2018, 11:42 am
ఐపీఎల్‌ 2018లో లీగ్ దశ ముగిసింది. కీలకమైన ప్లేఆఫ్‌కు సన్‌రైజర్స్, చెన్నైతోపాటు కోల్‌కతా, రాజస్థాన్ జట్లు అర్హత సాధించాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న సన్‌రైజర్స్, సూపర్ కింగ్స్ మధ్య మంగళవారం మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుంది. మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న కోల్‌కతా, రాజస్థాన్ మధ్య మరుసటి రోజు ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. క్వాలిఫైయర్-1లో ఓడిన జట్టు.. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో శుక్రవారం క్వాలిఫైయర్-2లో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో క్వాలిఫైయర్-1లో నెగ్గిన జట్టుతో ట్రోఫీ కోసం పోటీ పడుతుంది.
Samayam Telugu srh vs csk.


ఒకవేళ వర్షం లేదా ఇతర కారణాల వల్ల అనుకోని పరిస్థితుల్లో ముంబైలో జరగనున్న తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ రద్దయితే.. ఏమవుతుందో తెలుసా..? పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న సన్‌రైజర్స్ నేరుగా ఫైనల్ చేరుతుంది. అప్పుడు చెన్నై క్వాలిఫైయర్-2 ఆడాల్సి ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా, రాజస్థాన్‌లలో గెలిచిన జట్టుతో ధోనీ సేన తలపడుతుంది.

వర్షం కారణంగా సన్‌రైజర్స్, చెన్నై మధ్య మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నప్పటికీ.. పూర్తిగా కొట్టిపారేయలేం. మ్యాచ్ జరిగేందుకే ఎక్కువ ఛాన్స్‌లు ఉన్న నేపథ్యంలో లీగ్ దశలో రెండుసార్లు చెన్నై చేతిలో ఓడిన హైదరాబాద్ ప్లేఆఫ్‌లో ఎలా ఆడుతుందో చూడాలి మరి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.