యాప్నగరం

Rohit Sharma: ‘గాయం వల్లే రోహిత్‌ను పక్కనబెడితే.. మరి అతణ్ని ఎలా ఎంపిక చేశారు?’

గాయం కారణంగా రోహిత్ శర్మను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయలేదని చెబుతున్న బీసీసీఐ.. గాయపడిన మయాంక్ అగర్వాల్‌ను మూడు ఫార్మాట్లకు ఎలా ఎంపిక చేసిందని ఓజా ప్రశ్నించాడు.

Samayam Telugu 27 Oct 2020, 1:38 pm
ఆస్ట్రేలియా పర్యటన కోసం మూడు ఫార్మాట్లకూ భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోహిత్ శర్మ పేరును పక్కనబెట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. గాయం కారణంగా రోహిత్‌ను పక్కనబెట్టాల్సి వచ్చిందని బీసీసీఐ చెబుతున్నప్పటికీ.. ఇది కారణం కాదేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ముంబై ఇండియన్స్ ట్వీట్ చేయడం ఈ అనుమానాలకు బలం చేకూర్చింది.
Samayam Telugu rohit sharma | Image: Twitter/MumbaiIndians


రోహిత్ శర్మను కావాలనే పక్కనబెట్టారని.. రాజకీయాలకు అతడు బలైపోతున్నాడని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. గాయం కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకోక ముందే.. ఆస్ట్రేలియా పర్యటనకు ఎందుకు పక్కనబెట్టారని ప్రశ్నిస్తున్నారు.

కాగా బీసీసీఐ సెలక్షన్ పాలసీని ముంబై ఇండియన్స్ మాజీ ఆఫ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ప్రశ్నించాడు. అక్టోబర్ 18న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యామ్ స్ట్రింగ్ ఇంజ్యూరీకి గురైన రోహిత్ తర్వాత ముంబై ఆడిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. బీసీసీఐ రూల్స్ ప్రకారం గాయం బారిన పడిన ఆటగాడిని వెంటనే సెలక్షన్‌కు పరిగణనలోకి తీసుకోరు. అందుకే రోహిత్, ఇషాంత్ శర్మ పేర్లను జట్లలో చేర్చలేదు. వీరిద్దర్నీ బోర్డు మానిటర్ చేస్తుందని వెల్లడించారు. ఒకవేళ ఆస్ట్రేలియా పర్యటనకు ముందే కోలుకుంటే.. వీరు భారత జట్టుతో చేరతారు.

కానీ గాయపడ్డాడనే కారణంతో రోహిత్‌ను పక్కన బెట్టి.. గాయపడిన మయాంక్ అగర్వాల్‌ను మూడు ఫార్మాట్లకూ ఎంపిక చేయడాన్ని ఓజా ప్రశ్నించాడు. రోహిత్ శర్మకు మూడు ఫార్మాట్లలోనూ చోటు దక్కుతుందని తాను భావించానన్నాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద డామినేట్ చేసే సామర్థ్యం రోహిత్‌కు ఉందన్నాడు.

‘రోహిత్‌ పేరును చేర్చకపోవడమే కాదు.. పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలను రాహుల్‌కు కట్టబెట్టింది. ఒక వేళ సిరీస్ ప్రారంభానికి ముందే రోహిత్ ఫిట్‌నెస్ సాధిస్తే.. అప్పుడు వైఎస్ కెప్టెన్సీ విషయంలో సందిగ్ధత తలెత్తే అవకాశం ఉందని ఓజా అభిప్రాయపడ్డాడు. బీసీసీఐ తీరు వల్ల అనవసర సందిగ్ధత తలెత్తుతుందని.. ఇదంతా అవసరం లేదని ఓజా చెప్పుకొచ్చాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.