యాప్నగరం

భవిష్యత్తులో గొప్ప ఆటగాడు అవుతాడు.. అబ్దుల్ సమద్‌పై యువీ, భజ్జీ ప్రశంసలు

సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాట్స్‌మెన్ అబ్దుల్ సమద్ భవిష్యత్తులో ప్రత్యేకమైన ఆటగాడు అవుతాడంటూ యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ ప్రశంసలు గుప్పించారు.

Samayam Telugu 9 Nov 2020, 12:53 pm
అబుదాబీ: ఐపీఎల్ రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమి తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. ఓ దశలో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచిన ఆరెంజ్ ఆర్మీ.. ఆ తర్వాత వరుస విజయాలు సాధించింది. ఢిల్లీ చేతిలో ఓడినా.. అద్భుతమైన ఆటతీరుతో అందర్నీ కట్టిపడేసింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ యువ హిట్టర్ అబ్దుల్ సమద్ ఆడిన తీరు ఆకట్టుకుంది.
Samayam Telugu abdul samad
Image: IPL/BCCI


ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 16 బంతుల్లో 33 రన్స్ చేసి సన్‌రైజర్స్‌ను గెలిపించే ప్రయత్నం చేసిన సమద్‌‌పై మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ ప్రశంసలు గుప్పించారు. భవిష్యత్తులో అబ్దుల్ సమద్ ప్రత్యేకమైన, గొప్ప ఆటగాడు అవుతాడని భజ్జీ జోస్యం చెప్పాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో నోర్జే బౌలింగ్‌లో పుల్ షాట్‌‌తోపాటు కొన్ని అద్భుతమైన షాట్లు ఆడాడని హర్భజన్ కొనియాడాడు. సమద్ ఆటతీరు బాగుందని.. భవిష్యత్తులో స్పెషల్ ప్లేయర్ అవుతాడని యువీ ట్వీట్ చేశాడు.

సన్‌రైజర్స్ లోయర్ ఆర్డర్‌లో పవర్ హిట్టర్ అవసరం కావడంతో... మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ అబ్దుల్ సమద్‌ను రిక్రూట్ చేసుకున్నాడు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన టీనేజ్ క్రికెటర్ సమద్.. ఈ సీజన్లో తొలిసారి ఐపీఎల్ బరిలో దిగాడు. గత రంజీ సీజన్లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.