యాప్నగరం

వాంఖడేలో సిక్స్ పడిన చోట ధోనీకి సీటు.. గౌరవార్థం

2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ధోనీ కొట్టిన ఫినిషింగ్ సిక్స్‌తో వాంఖడే స్టేడియం దద్దరిల్లిపోయింది. భారత్ 28 ఏళ్ల సుదీర్ఘ వరల్డ్‌కప్‌ నిరీక్షణకి తెరదించిన చారిత్రక సిక్స్‌గా దాన్ని ఇప్పటికీ మాజీ క్రికెటర్లు అభివర్ణిస్తుంటారు.

Samayam Telugu 18 Aug 2020, 11:30 am
మహేంద్రసింగ్ ధోనీ అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది.. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో అతను కొట్టిన ఫినిషింగ్ సిక్స్. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌లో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ నువాన్ కులశేఖర బౌలింగ్‌లో ధోనీ కళ్లు చెదిరేరీతిలో బంతిని స్టాండ్స్‌లోకి తరలించాడు. 1983లో తొలిసారి వన్డే ప్రపంచకప్‌ని భారత్ గెలవగా.. 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకి ఆ సిక్స్‌తో ధోనీ తెరదించాడు. దాంతో.. భారత క్రికెట్ చరిత్రలోనే ఆ సిక్స్‌ని ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు. ఎంతలా అంటే..? దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. నేను తుది శ్వాస విడిచే ముందు ఆ సిక్స్‌ని తనవితీరా ఒకసారి చూసి చిరునవ్వుతో గుడ్ బై చెప్తానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
Samayam Telugu 2011 World Cup Winning Six



2004లో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ధోనీ.. 16 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కి గత శనివారం రిటైర్మెంట్ ప్రకటించాడు. దాంతో.. ముంబయి క్రికెట్ అసోషియేషన్ (ఎంసీఏ) ధోనీ గౌరవార్థం.. వాంఖడేలో ఒక సీటుకి అతని పేరు పెట్టనుంది. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ధోనీ కొట్టిన ఫినిషింగ్ సిక్స్ (బంతి) పడిన సీటుని ఇప్పటికే స్టేడియంలో గుర్తించామని వెల్లడించిన ఎంసీఏ.. ఆ సీటుని ప్రత్యేకంగా డెకరేట్ చేయనున్నట్లు తెలిపింది. వన్డే ప్రపంచకప్‌ని భారత్‌కి అందించిన ధోనీ గౌరవార్థం.. కి కృతజ్ఞతతో ఆ పని చేయబోతున్నట్లు ఎంసీఏ తెలిపింది. ఇప్పటికే వాంఖడే స్టేడియంలో సునీల్ గవాస్కర్‌కి రెండు శాశ్వత సీట్లు కేటాయించారు.

Read More: ధోనీ అడిగితే కదా తెలిసేది..? వీడ్కోలు మ్యాచ్‌ ఛాన్స్ ఇక లేదు: శుక్లా
1987లో అంతర్జాతీయ క్రికెట్‌కి సునీల్ గవాస్కర్ రిటైర్మెంట్ ప్రకటించగానే.. అతని గౌరవార్థం వాంఖడే స్టేడియంలో అప్పట్లో రెండు సీట్లని కేటాయించారు. కానీ.. 2011 వన్డే ప్రపంచకప్‌ ఆతిథ్యం కోసం స్టేడియంలో మార్పులు చేయగా ఆ రెండు సీట్లు కనుమరుగైపోయాయి. అయితే.. ఈ ఏడాది జులై 10న 71వ పుట్టిన రోజు జరుపుకున్న గవాస్కర్‌కి బర్త్ డే గిప్ట్‌గా.. స్టేడియంలోని ప్రెసిడెంట్స్ బాక్స్‌లో గవాస్కర్, అతని భార్యకి కలిపి రెండు శాశ్వత సీట్లని ఎంసీఏ కేటయిస్తూ నిర్ణయం తీసుకుంది.

Read More: టీమిండియాకి ధోనీ విలువ ఇక తెలుస్తుందిలే..!: మాజీ కెప్టెన్ హుస్సేన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.