యాప్నగరం

శ్రీలంకపై మిథాలీ సేన ఉత్కంఠ గెలుపు..!

నీలాక్షి భారీ షాట్లతో ఒక్కసారిగా మ్యాచ్‌ను లంకవైపు తిప్పింది. ఆమె జోరుతో ఒకానొక దశలో 165/7తో నిలిచిన శ్రీలంక 46.3 ఓవర్లు ముగిసే సమయానికి 205/7తో విజయానికి చేరువలో నిలిచింది. కానీ..?

Samayam Telugu 13 Sep 2018, 7:41 pm
శ్రీలంకతో జరుగుతున్న మూడు వన్డే సిరీస్‌లో భారత్ మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఐసీసీ మహిళల ఛాంపియన్‌‌షిప్‌లో భాగంగా గాలేలో ఈ టోర్నీ జరుగుతుండగా.. గురువారం ఉత్కంఠగా ముగిసిన రెండో వన్డేలో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌‌‌ని 2-0తో కైవసం చేసుకుంది. ఇక నామమాత్రమైన మూడో వన్డే ఆదివారం జరగనుంది.
Samayam Telugu 2nd odi india women clinch thriller to seal series vs sri lanka women
శ్రీలంకపై మిథాలీ సేన ఉత్కంఠ గెలుపు..!


మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. తనియా భాటియా (68: 66 బంతుల్లో 9x4), కెప్టెన్ మిథాలీ రాజ్ (52: 121 బంతుల్లో 4x4) అర్ధశతకాలు సాధించడంతో సరిగ్గా 50 ఓవర్లలో 219 పరుగులకి ఆలౌటైంది.

లక్ష్య ఛేదనలో చామరి ఆటపట్టు (57: 95 బంతుల్లో 8x4, 1x6), శశికళ (49: 91 బంతుల్లో 6x4), నీలాక్షి (31: 19 బంతుల్లో 2x4, 2x6) నిలకడగా ఆడటంతో శ్రీలంక అలవోక విజయాన్ని అందుకునేలా కనిపించింది. ముఖ్యంగా నీలాక్షి భారీ షాట్లతో ఒక్కసారిగా మ్యాచ్‌ను లంకవైపు తిప్పింది. ఆమె జోరుతో ఒకానొక దశలో 165/7తో నిలిచిన శ్రీలంక 46.3 ఓవర్లు ముగిసే సమయానికి 205/7తో విజయానికి చేరువలో నిలిచింది. కానీ.. జట్టు స్కోరు 207 వద్ద ఆమె ఔటవగా.. ఒత్తిడికి గురైన శ్రీలంక 48.2 ఓవర్లలో 211 పరుగులకే కుప్పకూలిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.