యాప్నగరం

IND vs WI: వైజాగ్ వన్డే ముంగిట భారత్ జట్టుతో బుమ్రా, పృథ్వీ షా

గాయంతో జస్‌ప్రీత్ బుమ్రా, నిషేధంతో పృథ్వీ షా గత కొంతకాలంగా భారత్ జట్టుకి దూరంగా ఉంటున్నారు. కానీ.. వైజాగ్ స్టేడియంలో సడన్‌గా టీమిండియా ఆటగాళ్లతో కలిసి వారు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు.

Samayam Telugu 17 Dec 2019, 3:40 pm
వెస్టిండీస్‌తో విశాఖపట్నం వేదికగా బుధవారం రెండో వన్డేలో భారత్ జట్టు ఢీకొనబోతోంది. ఈ మ్యాచ్‌ కోసం స్టేడియంలో ఏర్పాటు చేసిన నెట్స్‌లో ఈరోజు టీమిండియా ప్రాక్టీస్ చేస్తుండగా.. అనూహ్యంగా ఈ సెషన్‌కి ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, ఓపెనర్ పృథ్వీ షా వచ్చారు. రావడమే కాకుండా.. జట్టుతో కలిసి ఫిజియో, ట్రైనర్ పర్యవేక్షణలో కాసేపు ప్రాక్టీస్ కూడా చేశారు. కానీ.. ఈ ఇద్దరికీ రెండో వన్డేలో ఆడే అవకాశం లేదు. ఎందుకంటే.. వీరిని వన్డే సిరీస్‌ కోసం సెలక్టర్లు ఎంపిక చేయలేదు.
Samayam Telugu Prithvi Shaw, Jasprit Bumrah


Read More: భారత్‌తో వన్డే సిరీస్‌కి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

దక్షిణాఫ్రికాతో రెండు నెలల క్రితం జరిగిన టెస్టు సిరీస్‌కి ముందు వెన్ను గాయంతో భారత్ జట్టుకి దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా.. ఎట్టకేలకి మళ్లీ ఫిట్‌నెస్ సాధించాడు. మరోవైపు డోపింగ్ టెస్టులో ఫెయిలై 8 నెలలు నిషేధం ఎదుర్కొన్న పృథ్వీ షా.. ఇటీవల మళ్లీ రీఎంట్రీతో దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించాడు. దీంతో ఈ ఇద్దరినీ వచ్చే ఏడాది జనవరి ఆఖర్లో ప్రారంభంకానున్న న్యూజిలాండ్ పర్యటనకి ఎంపిక చేయాలని భారత సెలక్టర్లు యోచిస్తున్నారు.

Read More: చెాపాక్ వన్డేలో భారత్ ఓటమికి 5 కారణాలు


భారత్ జట్టుకి దూరమైన ఆటగాళ్లు మళ్లీ టీమ్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలంటే కచ్చితంగా ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వైజాగ్ స్టేడియానికి బుమ్రా, పృథ్వీ షాలని పిలిపించిన టీమిండియా మేనేజ్‌మెంట్.. వారి ఫిట్‌నెస్ లెవల్స్‌ని పరీక్షించింది. ఈ టెస్టులో బుమ్రా పాసైతే న్యూజిలాండ్ టూర్‌కి నేరుగా ఛాన్స్ దొరకడమే కాకుండా తుది జట్టులోనూ అవకాశం దక్కనుంది. కానీ.. పృథ్వీ షా జట్టులోకి ఎంపికైనా.. తుది జట్టులో ఛాన్స్ దక్కడం అనుమానమే. ఎందుకంటే.. ఇటీవల టెస్టుల్లో ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ నిలకడగా రాణిస్తున్న విషయం తెలిసిందే.

Read also: వెస్టిండీస్‌ టీమ్‌కి భారీ జరిమానా.. చెపాక్ వన్డేలో తప్పిదం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.