యాప్నగరం

ఆఖరి టీ20కి బంగ్లా వ్యూహం చెప్పేసిన కోచ్

పవర్ ప్లేలో ఫీల్డింగ్ పరిమితులు ఉండటంతో ఎలా బౌలింగ్ చేయాలో యువ బౌలర్లకి స్పష్టమైన అవగాహన ఉండదు. అదే బంగ్లాదేశ్‌కి మూడో టీ20లో అస్త్రంగా మారనున్నట్లు బంగ్లా కోచ్ పరోక్షంగా వెల్లడించాడు.

Samayam Telugu 9 Nov 2019, 7:37 pm
భారత్, బంగ్లాదేశ్ మధ్య సిరీస్ విజేత నిర్ణయాత్మక ఆఖరి టీ20 మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా ఆదివారం రాత్రి 7 గంటల నుంచి జరగనుంది. తొలి టీ20లో అనూహ్యంగా బంగ్లాదేశ్ చేతిలో ఓడిన భారత్.. రెండో టీ20లో బదులు తీర్చుకోవడంతో సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. ఆదివారం మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే సిరీస్ కైవసం కానుండటంతో రెండు జట్లూ పట్టుదలతో ఉన్నాయి. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా భారత్‌పై టీ20 సిరీస్‌ని బంగ్లాదేశ్ గెలవలేదు.
Samayam Telugu 3rd t20 we will target indias inexperienced bowling attack bangladesh coach
ఆఖరి టీ20కి బంగ్లా వ్యూహం చెప్పేసిన కోచ్


Read More: రోహిత్ సీరియస్.. పంత్ విషయంలో వార్నింగ్
భారత్‌తో కీలకమైన మూడో టీ20 ముంగిట మీడియాతో మాట్లాడిన బంగ్లాదేశ్ కోచ్ రసెల్ డొమింగో ఆ జట్టు వ్యూహమేంటో బహిర్గతం చేసేశాడు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతుండగా.. జట్టు కూర్పు, వ్యూహాల గురించి జర్నలిస్ట్‌లు ప్రశ్నించారు. దీంతో.. రసెల్ ‘ఇక్కడ రహస్యం ఏం లేదు. భారత్ జట్టు బౌలింగ్ లైనఫ్ అనుభవలేమితో ఉంది. కాబట్టి.. మా లక్ష్యం ఒక్కటే.. ఆరంభం నుంచి దూకుడుగా ఆడి టీమిండియా బౌలర్లని ఒత్తిడిలోకి నెట్టడం’ అని వెల్లడించాడు.

Read More: ధోనీ వ్యూహంతో భారత్‌ని ఓడించిన బంగ్లా‌దేశ్
రాజ్‌కోట్ వేదికగా గత గురువారం ముగిసిన రెండో టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓపెనర్లు లిట్టన్ దాస్, మహ్మద్ నయిమ్ పవర్ ప్లేలోనే భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా నయిమ్ అయితే యువ పేసర్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో వరుస ఫోర్లు బాదేశాడు. దీంతో.. మ్యాచ్ ఆఖరి వరకూ మళ్లీ ఖలీల్ లయ అందుకోలేకపోయాడు. మూడో టీ20లో ఖలీల్ స్థానంలో శార్ధూల్ ఠాకూర్ తుది జట్టులోకి ఎంపికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌కి దూరమైన విషయం తెలిసిందే.

Read More: 3rd T20కి భారత్ జట్టులో రెండు మార్పులు..?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.