యాప్నగరం

కెప్టెన్‌గా మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డ్..!

సీసీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో భాగంగా శ్రీలంకతో మంగళవారం ముగిసిన మ్యాచ్‌తో 118 వన్డేలకి కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి మహిళా కెప్టెన్‌గా మిథాలీ రాజ్ నిలిచింది.

Samayam Telugu 11 Sep 2018, 3:38 pm
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఐసీసీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో భాగంగా శ్రీలంకతో మంగళవారం ముగిసిన మ్యాచ్‌తో 118 వన్డేలకి కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి మహిళా కెప్టెన్‌గా మిథాలీ రాజ్ నిలిచింది. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ కెప్టెన్‌ ఎడ్వర్డ్స్‌ 117 వన్డేలకి నాయకత్వం వహించి అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తాజాగా మిథాలీ రాజ్ ఆమెని వెనక్కి నెట్టి నెం.1 స్థానంలో నిలిచింది. వీరిద్దరి తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్‌ బెలింద క్లార్క్ 101 మ్యాచ్‌లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. మొత్తంగా క్రికెట్ ప్రపంచంలో 100+ వన్డేలకి కెప్టెన్సీ వహించిన మహిళా క్రికెటర్లు ఈ ముగ్గురే కావడం విశేషం.
Samayam Telugu a new world record for mithali raj
కెప్టెన్‌గా మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డ్..!


లక్నో వేదికగా వెస్టిండీస్‌తో 2003-04లో జరిగిన వన్డే సిరీస్‌తో తొలిసారి భారత మహిళల జట్టుకి నాయకత్వం వహించిన మిథాలీ రాజ్.. ఆ తర్వాత రెండు సార్లు (2005, 2017) భారత జట్టుని ప్రపంచకప్‌ ఫైనల్‌కి చేర్చింది. వన్డేలతో పాటు 32 టీ20 మ్యాచ్‌లకి కూడా కెప్టెన్‌గా పనిచేసిన మిథాలీ రాజ్.. ఇటీవల ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టీ20 జట్టు కెప్టెన్‌గా హిట్టర్ హర్మన్‌ప్రీత్ కౌర్ కొనసాగుతోంది.

గాలే వేదికగా శ్రీలంకతో ఈరోజు ముగిసిన తొలి వన్డేలో భారత్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 35.1 ఓవర్లలో 98 పరుగులకే ఆలౌటవగా.. భారత్ జట్టు 19.5 ఓవర్లలోనే 100/1తో విజయాన్ని అందుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.