యాప్నగరం

విరాట్ కోహ్లికి సచిన్ స్పెషల్ బర్త్ డే విషెస్

ప్రస్తుత క్రికెట్లో తిరుగులేని ఆటతో రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న విరాట్ కోహ్లికి క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు

TNN 5 Nov 2017, 3:29 pm
ప్రస్తుత క్రికెట్లో తిరుగు లేని ఆటతో రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న విరాట్ కోహ్లికి క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. నవంబర్ 5న 29వ జన్మదినం జరుపుకొంటున్న కోహ్లికి బర్త్ డేను మరింత స్పెషల్‌గా మార్చాడు. సచిన్ ఆటను చూస్తూ పెరిగిన విరాట్.. అతడు నెలకొల్పిన రికార్డుల్ని బద్దలు కొట్టే దిశగా వేగంగా దూసుకెళ్తున్నాడు. ఇటీవలే వన్డేల్లో 32 శతకాలు పూర్తి చేసుకున్న కోహ్లి.. సచిన్ సాధించిన అత్యధిక శతకాల రికార్డుకు మరో 17 సెంచరీల దూరంలో నిలిచాడు. ఓవరాల్‌గా 49 సెంచరీలు చేసిన విరాట్.. మరో ఆరేడేళ్లు క్రికెట్ ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదే జరిగితే వన్డేల్లోనే కాదు సచిన్ నెలకొల్పిన వంద శతకాల రికార్డును కూడా అతడు అధిగమిస్తాడు.
Samayam Telugu a special birthday wish for virat kohli from sachin tendulkar
విరాట్ కోహ్లికి సచిన్ స్పెషల్ బర్త్ డే విషెస్


సచిన్ అంటే విరాట్ కోహ్లికి ఎనలేని అభిమానం. అతణ్ని ఎంతో ఆరాధిస్తాడు. 2011 వరల్డ్ కప్ సాధించాక.. విరాట్ తన ఆరాధ్య క్రికెటర్‌ను భుజాల మీద ఎత్తుకొని తిరిగాడు. అంచెలు అంచెలుగా ఎదుగుతూ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. ఫిట్‌నెస్ విషయంలో ఇతర ఆటగాళ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. దూకుడైన ఆటతీరుతో క్రికెట్‌పై తనదైన ముద్ర వేస్తున్న విరాట్ కోహ్లికి సచిన్ తనదైన శైలిలో బర్త్ డే విషెస్ చెప్పాడు.

A young, passionate cricketer is now the leader of a world beating team. U've come a long way, wish you tons of success 😉#HappyBirthdayVirat pic.twitter.com/lUAYo9rOAI — sachin tendulkar (@sachin_rt) November 5, 2017
క్రికెట్‌ అంటే అమితాసక్తి కనబరిచే యువ ఆటగాడు ప్రస్తుతం ప్రపంచ బ్యాటింగ్‌ టీమ్‌కి లీడర్‌గా అవతరించాడు. దీర్ఘకాలంలో నువ్వెంతో సాధించాలి. నీ కెరీర్లో అనేక విజయాలు సాధించాలని కోరుకుంటున్నా.. హ్యాపీ బర్త్ డే విరాట్ అంటూ సచిన్ కోహ్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.