యాప్నగరం

పాకిస్థాన్ సూపర్‌ లీగ్‌లోకి డివిలియర్స్ ఎంట్రీ..!

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత స్వదేశానికి వెళ్లిన ఈ హిట్టర్ అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌‌కి గుడ్‌బై చెప్పేశాడు. దీంతో.. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో అతను ఆడటంపైనా అనుమానాలు నెలకొన్నాయి.

Samayam Telugu 7 Sep 2018, 9:34 pm
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత స్వదేశానికి వెళ్లిన ఈ హిట్టర్ అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌‌కి గుడ్‌బై చెప్పేశాడు. దీంతో.. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో అతను ఆడటంపైనా అనుమానాలు నెలకొన్నాయి. కానీ.. 2019లో జరగనున్న పాకిస్థాన్ సూపర్ లీగ్‌ (పీఎస్‌ఎల్)‌లో తాను ఆడబోతున్నట్లు ఏబీ డివిలియర్స్ చేసిన తాజా ప్రకటన మళ్లీ అతని అభిమానుల్లో జోష్ నింపింది. ఐపీఎల్ తరహాలోనే పీఎస్‌ఎల్ కూడా ప్రైవేట్ లీగ్ కావడంతో.. వచ్చే ఏడాది ఐపీఎల్‌లోనూ ఏబీ ఆడతాడని స్పష్టమైంది.
Samayam Telugu 264890


‘క్రికెట్ ప్రపంచలో పాకిస్థాన్ సూపర్ లీగ్‌ వేగవంతంగా విస్తరిస్తున్న టీ20 టోర్నీ. గత మూడేళ్లుగా ఆ టోర్నీని చూస్తూ నేను ఎంజాయ్ చేస్తున్నా. అభిమానుల్ని కూడా ఈ టోర్నీ బాగా అలరిస్తోంది. అందుకే పీఎస్‌ఎల్ ద్వారా మళ్లీ నేను మైదానంలోకి అడుగుపెడుతున్నా’ అని ఏబీ డివిలియర్స్ ప్రకటించాడు.

పీఎస్‌ఎల్‌లో ఆడేందుకు ఏబీ డివిలియర్స్ అంగీకారం తెలపడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఇషాన్ మణి సంతోషం వ్యక్తం చేశారు. ‘ఏబీ డివిలియర్స్ ఈ తరం గొప్ప క్రికెటర్లలో ఒకరు. ఈ హిట్టర్ చేరికతో పీసీఎల్‌కి ఆదరణ మరింత పెరగనుంది. అంతేకాకుండా.. అతని ఆట చూసి పాక్ యువ క్రికెటర్లు నేర్చుకునే అవకాశం దక్కుతుంది’ అని వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.