యాప్నగరం

11 ఏళ్ల తర్వాత మళ్లీ పాక్ గడ్డపైకి డివిలియర్స్

దక్షిణాఫ్రికా తరఫున 2007-08లో ఆఖరిసారి పాకిస్థాన్‌లో ఏబీ డివిలియర్స్ పర్యటించాడు. ఆ తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా అతను అక్కడ క్రికెట్ ఆడలేదు.

Samayam Telugu 14 Jan 2019, 6:11 pm
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ దశాబ్దం తర్వాత పాకిస్థాన్ గడ్డపై మళ్లీ క్రికెట్ ఆడబోతున్నాడు. 2018 ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ఈ హిట్టర్.. ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ లీగ్స్‌లో ఆడుతూ అభిమానుల్ని అలరిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్‌ (పీఎస్‌ఎల్)లో లాహోర్ ఖలాండర్స్ టీమ్ తరఫున ఆడుతున్న ఏబీ డివిలియర్స్.. మ్యాచ్‌ల కోసం త్వరలోనే అక్కడికి వెళ్లబోతున్నాడు. దక్షిణాఫ్రికా తరఫున 2007-08లో ఆఖరిసారి పాకిస్థాన్‌లో డివిలియర్స్ పర్యటించాడు.
Samayam Telugu 455111_82449721


వాస్తవానికి భద్రతా కారణాల దృష్ట్యా పీఎస్‌ఎల్ టోర్నీలో విదేశీ క్రికెటర్లు ఆడేందుకు అనాసక్తి కనబర్చగా మ్యాచ్‌ల్ని యూఏఈకి తరలించి ఆడిస్తున్నారు. అయితే.. ఫైనల్‌తో పాటు కొన్ని కీలక మ్యాచ్‌ల్ని మాత్రం పాకిస్థాన్‌లో నిర్వహిస్తామని ఇటీవల టోర్నీ నిర్వాహకులు చెప్పగా.. విదేశీ క్రికెటర్లు ససేమేరా అన్నారు. అందులో ఏబీ డివిలియర్స్ కూడా ఉన్నాడు. కానీ.. తాజాగా మనసు మార్చుకున్న ఏబీ.. తాను పాకిస్థాన్‌కి వెళ్తున్నట్లు ప్రకటించాడు.

భారత్‌లో ఐపీఎల్ 2019 సీజన్ మార్చి 23 నుంచి ప్రారంభంకానుండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఏబీ డివిలియర్స్ ఆడనున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.