యాప్నగరం

మంత్రిగారూ.. నాదో విన్నపం: అభినవ్ బింద్రా

అండగా ఉండాల్సిన కోచ్ ఫీజు ఇవ్వలేదనే కోపంతో మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో అంధురాలైన కాంచనమాల

TNN 15 Jul 2017, 1:22 pm
భారత అధికారుల నిర్లక్ష్యం కారణంగా బెర్లిన్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పారా అథ్లెట్‌ కాంచనమాల‌‌కి మద్దతుగా అభినవ్ బింద్రా గళం విప్పుతున్నాడు. ప్రపంచ వేదికలపై పోటీపడే అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ని ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయెల్‌కి తాజాగా ఒక అభ్యర్థన పంపాడు. ఇప్పటికే ప్రధాన మంత్రి ఏర్పాటు చేసిన ఒలింపిక్ టాస్క్ ఫోర్స్‌లో సభ్యుడైన అభినవ్ బింద్రా సూచనపై మంత్రి కూడా సానుకూలంగానే స్పందించనట్లు సమాచారం.
Samayam Telugu abhinav bindra writes to sports ministry suggests athlete helpline
మంత్రిగారూ.. నాదో విన్నపం: అభినవ్ బింద్రా


ఇటీవల బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ పారా స్విమ్మింగ్‌‌‌లో పోటీపడేందుకు అక్కడకి వెళ్లిన నాగ్‌పూర్‌కి చెందిన కాంచనమాల ఆర్థిక ఇబ్బందులతో చివరికి బిక్షమెత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత పారాలింపిక్ కమిటీ ఖర్చుల కోసం స్విమ్మర్‌కి ఇవ్వాల్సిన నిధులు మంజూరు చేయకుండా నిర్లక్ష్యంతో వ్యవహరించగా.. అండగా ఉండాల్సిన కోచ్ ఫీజు ఇవ్వలేదనే కోపంతో మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో అంధురాలైన కాంచనమాల తీవ్ర ఇబ్బందులు పడినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా.. చివరికి 200 మీ వ్యక్తిగత మెడ్లేలో రజత పతకం నెగ్గింది. ఈ అథ్లెట్ దీనగాథని తెలుసుకున్న అభినవ్ బింద్రా ట్విట్టర్ వేదికగా అధికారుల తీరుపై మండిపడగా.. కేంద్ర మంత్రి విజయ్ గోయెల్ స్పందించి విచారణకి ఆదేశించారు. మరే అథ్లెట్‌ ఇలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో బింద్రా ఈ హెల్ప్‌లైన్ సూచన చేసినట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.