యాప్నగరం

పొలార్డ్ అతి తెలివి.. కంగుతిన్న అంపైర్

బౌలర్ క్రీజు వెలుపల పాదం ఉంచి బంతి విసిరితే ఫీల్డ్ అంపైర్ నోబాల్‌గా ప్రకటించడం మామూలే. కానీ.. కీరన్ పొలార్డ్‌ అంపైర్ నోబాల్ అని ప్రకటించగానే.. బంతి విసరడం ఆపేసి ట్విస్ట్ ఇచ్చాడు.

Samayam Telugu 12 Nov 2019, 1:34 pm
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లతో తరచూ గొడవపడే పొలార్డ్‌‌కి ఫీల్డ్ అంపైర్లు వార్నింగ్ ఇస్తుంటారు. ఆ హెచ్చరికలకి కూడా పొలార్డ్ తనదైన శైలిలో కౌంటర్లిస్తుంటాడు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కి ఆడే పొలార్డ్‌ ఓసారి క్రిస్‌గేల్‌తో గొడవపడితే అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో నోటికి ప్లాస్టర్ వేసుకుని మైదానంలోకి దిగిన పొలార్డ్ తన నిరసనని తెలియజేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ టైమ్‌లోనూ ఫీల్డ్ అంపైర్ వైడ్ ఇవ్వకపోవడంతో.. తర్వాత బంతి కోసం వికెట్లని విడిచి వైడ్‌ లైన్‌పైకి వెళ్లి మరీ బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అంపైర్ల తప్పిదాల కారణంగా పొలార్డ్ గొడవపడిన సందర్భాలు కోకొల్లలు.
Samayam Telugu Kieron Pollard


Read More: భారత్‌లో బాల్ టాంపరింగ్‌.. అడ్డంగా దొరికిన క్రికెటర్ (వీడియో)


మైదానంలో అంపైర్‌ని ఆడుకునే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోని పొలార్డ్ మరోసారి.. ఫీల్డ్ అంపైర్‌‌కి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. అఫ్గానిస్థాన్‌తో లక్నో వేదికగా తాజాగా జరిగిన మూడో వన్డేలో బౌలింగ్ చేసిన కీరన్ పొలార్డ్.. ఒక బంతిని క్రీజు వెలుపల పాదం ఉంచి విసరబోయాడు. దీంతో.. వెంటనే ఫీల్డ్ అంపైర్ ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించాడు. కానీ.. అంపైర్ నోటి నుంచి నోబాల్ అని రాగానే.. క్షణాల వ్యవధిలో బంతి విసరడాన్ని పొలార్డ్ ఆపేశాడు. దీంతో.. కంగుతిన్న అంపైర్ తన నోబాల్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని.. డెడ్‌బాల్‌గా ప్రకటించాడు. మీడియం పేసరైన పొలార్డ్.. అంపైర్ నోటి వెంట నోబాల్‌ అని రాగానే బంతిని విసరకుండా నియంత్రించుకోడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Read More: IND vs BAN తొలి టెస్టు‌ ముంగిట ఒకరు ఔట్
మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్ హజ్రతుల్లా (50: 59 బంతుల్లో 7x4, 2x6), అస్గర్ అఫ్గాన్ (86: 85 బంతుల్లో 3x4, 6x6), మహ్మద్ నబీ (50 నాటౌట్: 66 బంతుల్లో 3x4, 1x6) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. అనంతరం లక్ష్యాన్ని వెస్టిండీస్ జట్టు షైహోప్ (109 నాటౌట్: 145 బంతుల్లో 8x4, 3x6) సెంచరీ బాదడంతో 48.4 ఓవర్లలోనే 253/5తో ఛేదించేసింది. ఈ సిరీస్‌కి వెస్టిండీస్ కెప్టెన్‌గా కీరన్ పొలార్డ్ వ్యవహరిస్తున్నాడు.

Read More: IND vs BAN D/N Test: కోహ్లీసేన స్పెషల్ రిక్వెస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.