యాప్నగరం

అప్ఘాన్ టీనేజ్ స్పిన్నర్ వరల్డ్ రికార్డ్.. ప్రీతి జింతా ఫుల్ ఖుషీ!

రషీద్ ఖాన్ బాటలోనే అప్ఘానిస్థాన్ నుంచి మరో టీనేజీ సంచలనం వెలుగులోకి వచ్చాడు. పిన్న వయసులోనే ఐదు వికెట్లు తీసి ప్రపంచ రికార్డ్ బ్రేక్ చేశాడు.

TNN 17 Feb 2018, 5:54 pm
అప్ఘాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ బాటలోనే మరో యువ స్పిన్నర్ వెలుగులోకి వచ్చాడు. ఆ దేశానికి చెందిన లెగ్ స్పిన్నర్ ముజీబ్ జర్డాన్ టీనేజీలోనే అంతర్జాతీయ వన్డేల్లో ఐదు వికెట్ల హాల్ సాధించాడు. జింబ్వాతే జరిగిన మ్యాచ్‌లో జర్డాన్ 50 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. తద్వారా ఐదు వికెట్ల హాల్ సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డ్ నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డ్ పాకిస్థానీ ప్లేయర్ వకార్ యూనిస్ పేరిట ఉండగా.. దాన్ని ముజీబ్ జర్డాన్ బ్రేక్ చేశాడు. వకార్ యూనిస్ 18 ఏళ్ల 164 రోజుల వయసులో ఐదు వికెట్ల హాల్ సాధించాడు.
Samayam Telugu afghan teen mujeeb zadran breaks waqar younis odi record
అప్ఘాన్ టీనేజ్ స్పిన్నర్ వరల్డ్ రికార్డ్.. ప్రీతి జింతా ఫుల్ ఖుషీ!


ముజీబ్ ఉర్ రహ్మాన్‌గానూ పిలుచుకునే జర్డాన్ ఐదు వికెట్ల హాల్ సాధించంతో జింబాబ్వే 34 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన అప్ఘాన్ జట్టు 22 ఓవర్లలోనే పది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో అప్ఘాన్ 3-1 తేడాతో ఐదు వన్డేల సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది.

ముజీబ్‌ జర్డాన్‌ను ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. అండర్-19 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై 4 వికెట్లు తీసిన ముజీబ్ అప్ఘాన్‌ను సెమీస్ చేర్చాడు. ఇప్పటి వరకూ ఏడు వన్డేలు ఆడిన ముజీబ్ జర్డాన్ 18 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఈ టీనేజీ ప్లేయర్ త్వరలోనే యువీ, అశ్విన్, ఫించ్‌తో కలిసి ఐపీఎల్ బరిలో దిగనున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.