యాప్నగరం

అప్ఘాన్ క్రికెట్లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో యువ ఓపెనర్ దుర్మరణం

రోడ్డు దాటుతుండగా.. కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన అప్ఘాన్ క్రికెటర్ నజీబ్ తర్కారీ మంగళవారం తుది శ్వాస విడిచాడు.

Samayam Telugu 6 Oct 2020, 11:23 am
అప్ఘానిస్థాన్‌ క్రికెట్లో విషాదం చోటు చేసుకుంది. గత వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అప్ఘాన్ బ్యాట్స్‌మెన్ నజీబ్ తర్కారీ మంగళవారం తుది శ్వాస విడిచాడు. జలాలాబాద్‌లోని ఈస్ట్రన్ నంగ్రహార్‌లో రోడ్డు దాటుతున్న సమయంలో తర్కారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన అతడు కోమాలోకి వెళ్లాడు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ప్రాణాలు కోల్పోయాడు.
Samayam Telugu afghan cricketer | Image: Twitter


తర్కారీ మరణించిన విషయాన్ని అప్ఘానిస్థాన్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తమ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్, మంచి వ్యక్తిత్వం ఉన్న నజీబ్ తర్కారీ (29) మరణం పట్ల అప్ఘాన్ క్రికెట్ బోర్డు సంతాపం వ్యక్తం చేసింది. రోడ్డు ప్రమాదంలో యువ క్రికెటర్ మరణించడం షాక్‌కు గురి చేసిందని పేర్కొంది.

నజీబ్ 2014లో ఆసియాలో కప్‌లో బంగ్లాదేశ్‌తో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అప్ఘాన్ తరఫున 13 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన తర్కారీ.. గ్రేటర్ నోయిడాలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 90 రన్స్ చేశాడు. కానీ తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు.

కారు బాంబు దాడి ఘటనలో అప్ఘాన్ అంపైర్ బిస్మిల్లా జాన్ షేన్వారీ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ బాంబు దాడిలో బిస్మిల్లా కుటుంబానికి చెందిన ఏడుగురు చనిపోయారు. అప్ఘాన్‌లోని నంగ్రహర్ ప్రావిన్స్‌లో ఓ ప్రభుత్వ భవంతిని టార్గెట్ చేసి ఆత్మాహుతి దాడి చేయడంతో.. బిస్మిల్లా కుటుంబీకులతోపాటు కనీసం 15 మంది చనిపోగా.. 40 మంది గాయపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.