యాప్నగరం

అఫ్గాన్‌తో టెస్టులో అనుభవమే భారత్ బలం..!

అఫ్గానిస్థాన్‌తో గురువారం నుంచి జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో అనుభవం ఉన్న క్రికెటర్లు ఉండటమే భారత జట్టు బలమని టీమిండియా వికెట్ కీపర్

Samayam Telugu 12 Jun 2018, 7:20 pm
అఫ్గానిస్థాన్‌తో గురువారం నుంచి జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో అనుభవం ఉన్న క్రికెటర్లు ఉండటమే భారత జట్టు బలమని టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల టెస్టు హోదా దక్కించుకున్న అఫ్గానిస్థాన్‌ జట్టు బెంగళూరు వేదికగా ఈ మ్యాచ్ ఆడనుండగా.. గాయపడిన వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా స్థానంలో దినేశ్ కార్తీక్ భారత జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. స్పిన్నర్లు రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ మెరుగ్గా రాణించడంతో.. మూడు రోజుల క్రితం బంగ్లాదేశ్‌తో ముగిసిన మూడు టీ20ల సిరీస్‌ని క్లీన్‌స్వీప్ చేసిన అఫ్గానిస్థాన్‌ అదే జోరుని భారత్‌పై కూడా చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే భారత జట్టుతో పోలిస్తే.. అఫ్గానిస్థాన్ జట్టులో అత్యుత్తమ స్పిన్నర్లున్నారంటూ ఆ జట్టు కెప్టెన్ అస్గర్‌ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.
Samayam Telugu afghanistans is a beautiful journey but we have experience dinesh karthik
అఫ్గాన్‌తో టెస్టులో అనుభవమే భారత్ బలం..!


అస్గర్‌ వ్యాఖ్యలపై మంగళవారం దినేశ్ కార్తీక్ స్పందించాడు. ‘భారత జట్టులోని స్పిన్నర్లతో పోలిస్తే అఫ్గానిస్థాన్ స్పిన్నర్లు చాలా తక్కువ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడారు. అస్గర్‌ ఏమన్నాడో నాకు సరిగా తెలీదు. కానీ.. జట్టు విజయాల్లో అనుభవం ఉన్న క్రికెటర్ల పాత్రే ఎక్కువగా ఉంటుంది. దీనికి ఉదాహరణ.. ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టైటిల్‌ను అందుకోవడమే. భవిష్యత్‌లో తప్పకుండా ఇప్పటి కంటే మెరుగైన బౌలర్లు అఫ్గానిస్థాన్ టెస్టు జట్టులో ఉంటారు’ అని దినేశ్ కార్తీక్ వెల్లడించాడు. ఈ టెస్టు మ్యాచ్‌కి విరాట్ కోహ్లి స్థానంలో అజింక్య రహానె కెప్టెన్‌గా వ్యవహరించునున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.