యాప్నగరం

టీ20 మ్యాచ్‌లో డబుల్ సెంచరీ కొట్టేశాడు..!

ఢిల్లీకి చెందిన మోహిత్ అహ్లవాట్ టీ20ల్లో ట్రిఫుల్ సెంచరీ చేయగా.. తాజాగా అఫ్గానిస్థాన్ వికెట్ కీపర్/ బ్యాట్స్‌మెన్ షఫీఖుల్లా షఫక్ డబుల్ సెంచరీ కొట్టేశాడు.

TNN 10 Jul 2017, 11:29 am
టెస్టుల్లో ట్రిఫుల్ సెంచరీ.. వన్డేల్లో డబుల్ సెంచరీ.. టీ20ల్లో సెంచరీ.. ఊహించడానికి కొంచెం కష్టమైనా.. వర్తమాన క్రికెటర్లు అడపాడదపా కొట్టేస్తున్నారు. అయితే ఇటీవల వీరి జోరు మరింత పెరిగింది. ఇప్పుడు ఏకంగా టీ20ల్లోనే ట్రిఫుల్, డబుల్ సెంచరీలు బాదేస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఢిల్లీకి చెందిన మోహిత్ అహ్లవాట్ టీ20ల్లో ట్రిఫుల్ సెంచరీ చేయగా.. తాజాగా అఫ్గానిస్థాన్ వికెట్ కీపర్/ బ్యాట్స్‌మెన్ షఫీఖుల్లా షఫక్ డబుల్ సెంచరీ కొట్టేశాడు.
Samayam Telugu afhanistan batsman shafiqullah shafaq scores double century t20 game
టీ20 మ్యాచ్‌లో డబుల్ సెంచరీ కొట్టేశాడు..!


అఫ్గానిస్థాన్‌లో జరిగిన ఒక టీ20 మ్యాచ్‌లో 71 బంతులు ఎదుర్కొన్న షఫక్ 16x4, 21x6 సిక్స్‌ల సాయంతో 214 పరుగులు చేశాడు. అతను కేవలం బౌండరీల ద్వారానే 190 పరుగులు రాబట్టడం కొసమెరుపు. దీంతో షఫక్ ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు 20 ఓవర్లలో 351 పరుగులు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో ప్రత్యర్థి జట్టు 107 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ జట్టు మొత్తం షఫక్ చేసిన పరుగుల్లో సగం మాత్రమే చేయడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.