యాప్నగరం

కోహ్లితో పోల్చుకొని ధోనీలా హెలీకాఫ్టర్ షాట్ ఆడాడు

ఇటీవలే విరాట్ కోహ్లితో పోల్చుకొని సొంత దేశంలోని అభిమానులతోనే చివాట్లు తిన్న పాక్ క్రికెటర్ ఇప్పుడు ధోనీ షాట్‌తో మరోసారి వార్తల్లోకి వచ్చాడు.

TNN 31 Dec 2016, 2:56 pm
పాకిస్థాన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ ఇటీవలే తనకు తాను విరాట్ కోహ్లితో పోల్చుకొని వార్తల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాను చూడటానికి కోహ్లిలా ఉంటానని, పరుగులు చేయడంలో ఇద్దరి మధ్య పోలిక ఉందని షెహజాద్ చెప్పుకొచ్చాడు. అక్కడితో ఆగకుండా.. విరాట్ కోహ్లీ, జో రూట్‌, కేన్‌ విలియమ్సన్‌‌లకు వారి జట్టు సభ్యులు, అభిమానుల నుంచి ఎంతో మద్దతు లభిస్తోందని, ఈ విషయంలో తాను దురదృష్టవంతుడినని షెహజాద్‌ చెప్పాడని ఓ స్పోర్ట్స్‌ జర్నలిస్టు ట్వీట్ చేశాడు. దీంతో నీకు విరాట్ కోహ్లికి పోలికేంటి అంటూ.. నెటిజన్లు షెహజాద్‌ను ఓ ఆటాడుకున్నారు.
Samayam Telugu after comparing himslef with virat kohli ahmed shehzad plays dhonis helicopter shot
కోహ్లితో పోల్చుకొని ధోనీలా హెలీకాఫ్టర్ షాట్ ఆడాడు


తనకు తాను కోహ్లితో పోల్చుకున్న ఈ క్రికెటర్ ఈసారి తన మాటలతో కాకుండా విలక్షణమైన షాట్‌తో మరోసారి వార్తల్లోకి వచ్చాడు. కెప్టెన్ కూల్ ధోనీ ట్రేడ్ మార్క్ షాట్ అయిన హెలీకాఫ్టర్ షాట్ ఆడటంతో.. ఇప్పుడా వీడియో వైరల్ అయ్యింది. ఈ షాట్‌ను షెహజాద్ అచ్చం ధోనీలాగే ఆడాడు. కరాచీలో జరిగిన మ్యాచ్‌లో హబీబ్ బ్యాంక్ లిమిటెడ్ తరఫున ఆడిన షెహజాద్.. ఆ మ్యాచ్‌లో 112 పరుగులతో రాణించాడు. ఆ క్రమంలోనే అన్వర్ అలీ వేసిన బంతిని హెలీకాఫ్టర్ షాట్ ఆడి స్టాండ్స్‌లోకి పంపాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.