యాప్నగరం

KXIP టీమ్‌‌లో సెహ్వాగ్ వెనుకే మరో వికెట్..?

ఐపీఎల్ 2018 సీజన్‌ని వరుస విజయాలతో ఆరంభించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్.. హాఫ్ సీజన్ తర్వాత వరుస పరాజయాల్ని చవిచూసి ఆఖరికి ఏడో స్థానంలో నిలిచింది.

Samayam Telugu 5 Nov 2018, 6:59 pm
ఐపీఎల్‌‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ.. జట్టు కోచింగ్ స్టాఫ్‌పై ఉద్వాసనపర్వాన్ని కొనసాగిస్తోంది. రెండు రోజుల క్రితం జట్టు మెంటార్ బాధ్యతల నుంచి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ని అనూహ్యంగా తప్పించిన ఫ్రాంఛైజీ.. బౌలింగ్ కోచ్‌ వెంకటేశ్ ప్రసాద్‌పై కూడా వేటు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు జూనియర్ సెలక్షన్ కమిటీ చీఫ్‌గా ఉన్న వెంకటేశ్.. పంజాబ్ టీమ్‌ కోసం ఆ పదవిని వదులుకుని మరీ వచ్చాడు.
Samayam Telugu Indore: Rajasthan Royals Ajinkya Rahane (L) dives as KXIPs wicketkeeper trying...
Rajasthan Royals' Ajinkya Rahane (L) dives as KXIP's wicketkeeper trying to runout unsuccessfully during an IPL 2018 cricket match against Kings XI Punjab at MPCA Holkar Stadium in Indore on Sunday.Photo by Atul Yadav


ఐపీఎల్ 2018 సీజన్‌ని వరుస విజయాలతో ఆరంభించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్.. హాఫ్ సీజన్ తర్వాత వరుస పరాజయాల్ని చవిచూసి ఆఖరికి ఏడో స్థానంలో నిలిచింది. ముఖ్యంగా.. జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు, తుది జట్టు ఎంపికలో పొరపాట్లు పంజాబ్ ప్రదర్శనని దారుణంగా దెబ్బతీశాయి. దీంతో.. మెంటార్ సెహ్వాగ్‌పై అప్పటి నుంచి గుర్రుగా ఉన్న ఫ్రాంఛైజీ.. అతనికి ఉద్వాసన పలికింది. అప్పట్లో సెహ్వాగ్ పిలుపు మేరకు వెంకటేశ్ వచ్చి ఉండటంతో.. అతనిపై కూడా ఈ వేటు పడనున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.

మెంటార్ సెహ్వాగ్‌పైనే కాదు.. ఆ జట్టు చీఫ్ కోచ్ బ్రాడ్ హడ్జ్‌పైనా కింగ్స్ ఎలెవన్ ఫ్రాంఛైజీ వారం క్రితం వేటు వేసింది. అతని స్థానంలో న్యూజిలాండ్ మాజీ కోచ్‌ మైక్ హసన్‌ని తీసుకుంది. ఇప్పుడు వెంకటేశ్ ప్రసాద్‌పై కూడా వేటు వేసి అతని స్థానంలో శ్రీధరన్ శ్రీరామ్‌ని తీసుకోవాలనే యోచనలో పంజాబ్ ఫ్రాంఛైజీ ఉన్నట్లు సమచారం. శ్రీరామ్ ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టుకి స్పిన్ కోచ్‌గా పనిచేస్తున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.