యాప్నగరం

సెలక్టర్లూ.. ప్రతిభను మాత్రమే చూడండి..!

జాతీయ జట్టుకి క్రికెటర్‌ని ఎంపిక చేసే సమయంలో వయసు కంటే ప్రతిభకే ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని భారత దిగ్గజ క్రికెటర్ సచిన్

Samayam Telugu 7 Aug 2018, 5:27 pm
జాతీయ జట్టుకి క్రికెటర్‌ని ఎంపిక చేసే సమయంలో వయసు కంటే ప్రతిభకే ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సూచించాడు. భారత్‌తో లార్డ్స్‌ వేదికగా గురువారం నుంచి జరగనున్న రెండో టెస్టు కోసం ఇంగ్లాండ్ ప్రకటించిన జట్టులో ఇద్దరు యువ క్రికెటర్లకి చోటు దక్కడంపై అభిప్రాయడం అడగ్గా.. పైవిధంగా సచిన్ స్పందించాడు. తొలి టెస్టు ఆడిన 20 ఏళ్ల కుర్రాన్‌‌ని రెండో టెస్టులోకి ఎంపిక చేసిన ఇంగ్లాండ్ సెలక్టర్లు.. అతనితో పాటు అలీ పోప్‌ని కూడా జట్టులోకి తీసుకున్నారు. 20 ఏళ్ల పోప్‌కి ఇదే తొలి టెస్టు కానుంది. ఇంగ్లాండ్ వేదికగా ఓ క్రికెట్ అకాడమీని తాజాగా ప్రారంభించిన సచిన్ టెండూల్కర్‌ ఇప్పుడు కుర్రాళ్లకి అక్కడ క్రికెట్ పాఠాలు చెప్తున్నాడు.
Samayam Telugu kklso6ahdcesi


‘క్రికెటర్‌లో ప్రతిభ ఉంటే.. వయసుని పరిగణలోకి తీసుకోకుండా అతడ్ని దేశం తరఫున ఆడించాలి. నేను తొలి మ్యాచ్ ఆడినప్పుడు నా వయసు 16 మాత్రమే. ఆ సమయంలో సెలక్టర్లు కేవలం నా ప్రతిభని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. అప్పట్లో పాకిస్థాన్‌ పేసర్లు వసీం అక్రమ్, వకార్ యూనిస్, ఇమ్రాన్‌ ఖాన్, అబ్దుల్ ఖాదిర్‌లను ఎలా ఎదుర్కోవాలో..? నాకు తెలీదు. ఇక్కడ కూడా అంతే.. కుర్రాన్, పోప్‌‌ల వయసుని చూడొద్దండి. వారికి భారత్‌తో టెస్టు సిరీస్‌ రూపంలో కఠిన సవాల్ ఎదురుకానుంది. కానీ.. వాటిని అధిగమించి రాణించాలి’ అని టెండూల్కర్ సూచించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.