యాప్నగరం

ధోనీపై వేటు సరైన నిర్ణయమే: అగార్కర్

2020లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. అప్పటి వరకు ధోనీ ఆడతాడనే నమ్మకం లేదు. దీనికి తోడు ఇటీవల టీ20 సిరీస్‌ల్లో అతని ప్రదర్శన కూడా ఆశాజనకంగా లేదు. - అజిత్ అగార్కర్

Samayam Telugu 28 Oct 2018, 4:55 pm
టీ20 జట్టు నుంచి మహేంద్రసింగ్ ధోనీని సెలక్టర్లు తప్పించడం సరైన నిర్ణయమేనని మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్‌, ఆస్ట్రేలియాతో త్వరలో జరగనున్న టీ20 సిరీస్‌ కోసం సెలక్టర్లు ఇటీవల జట్టుని ప్రకటించగా.. అందులో ధోనీపై వేటు వేశారు. దీంతో.. ఈ మాజీ కెప్టెన్ టీ20 కెరీర్‌ ఇక ముగిసిపోయిందంటూ వార్తలు వచ్చాయి.
Samayam Telugu 1540716090-Dhoni_-_Agarkar


2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా భారత్ జట్టుని విజేతగా నిలిపిన మహేంద్రసింగ్ ధోనీకి ఈ పొట్టి క్రికెట్‌లో సుదీర్ఘ అనుభవం ఉంది. ఎంతలా అంటే.. భారత్ జట్టు ఇప్పటి వరకు మొత్తం 104 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడితే.. ధోనీ ఏకంగా 93 మ్యాచ్‌ల్లో వికెట్ కీపర్‌గా తుది జట్టులో ఆడాడు.

టీ20ల నుంచి ధోనీని తప్పించడంపై తాజాగా అజిత్ అగార్కర్ మాట్లాడుతూ ‘రెండు సిరీస్‌ల్లో ధోనీని తప్పించినంత మాత్రాన అతని టీ20 కెరీర్ ముగిసినట్లు కాదు అని సెలక్టర్లు అంటున్నారు. కానీ.. వాళ్లు ఎందుకు అలా అన్నారో నాకు అర్థం కావడం లేదు. అయితే.. ధోనీని తప్పించడం మాత్రం సరైన నిర్ణయమేని నా అభిప్రాయం. ఎందుకంటే 2020లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. అప్పటి వరకు ధోనీ ఆడతాడనే నమ్మకం లేదు. దీనికి తోడు ఇటీవల టీ20 సిరీస్‌ల్లో అతని ప్రదర్శన కూడా ఆశాజనకంగా లేదు. అందుకే.. ప్రత్యామ్నాయ వికెట్ కీపర్‌ని జట్టులో సిద్ధం చేసుకునేందుకు సెలక్టర్లు సరైన సమయంలోనే నిర్ణయం తీసుకున్నారు’ అని అజిత్ అగార్కర్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.