యాప్నగరం

ఐదో టెస్టులో ఎలా ఆడినా..? కుక్ గ్రేట్

భారత్‌పై అరంగేట్రం టెస్టులోనే శతకం బాదిన అలిస్టర్ కుక్.. ఆ తర్వాత టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్.

Samayam Telugu 4 Sep 2018, 5:32 pm
ఇంగ్లాండ్ సీనియర్ ఓపెనర్ అలిస్టర్ కుక్ గొప్ప బ్యాట్స్‌మెన్ అని మాజీ క్రికెటర్ నాసర్ హుస్సేన్ కొనియాడాడు. భారత్‌తో శుక్రవారం నుంచి జరగనున్న ఐదో టెస్టు మ్యాచ్‌‌ తన కెరీర్‌లో చివరిదంటూ అనూహ్యంగా సోమవారం అలిస్టర్ కుక్ తన రిటైర్మెంట్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్‌తో విదర్భ వేదికగా 2006 మార్చిలో జరిగిన టెస్టు మ్యాచ్‌తో ఐదు రోజుల ఫార్మాట్‌లోకి అడుగుపెట్టిన అలిస్టర్ కుక్.. ఆ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 60, 104 పరుగులతో రాణించాడు. దీంతో.. అనతికాలంలోనే అతని‌కి జట్టులో సుస్థిర స్థానం లభించింది.
Samayam Telugu BIRMINGHAM: Englands Alastair Cook walks back to the pavilion after being dism...


వన్డేలు, టీ20లతో పాటు టెస్టుల్లోనూ నమ్మదగిన ఆటగాడిన గుర్తింపు పొందిన ఈ ఓపెనర్.. నాలుగేళ్లుగా కేవలం టెస్టులకే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 160 టెస్టులాడి ఏకంగా 12,254 పరుగులు చేశాడు. ఇందులో 5 ద్విశతకాలు ఉండగా.. 32 శతకాలు ఉన్నాయి.టెస్టుల్లో ఇంగ్లాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కుక్ ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

కుక్ రిటైర్మెంట్‌పై తాజాగా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నాసర్ హుస్సేన్ స్పందించాడు. ‘ఐదో టెస్టుకి ఆతిథ్యమివ్వనున్న ఓవల్ మైదానంలో అలిస్టర్ కుక్ ఎలా ఆడతాడో తెలీదు. కానీ.. ఎలా ఆడినా.. అతను ఇంగ్లాండ్ గొప్ప బ్యాట్స్‌మెన్. సుదీర్ఘకాలం అద్భుతంగా క్రికెట్ ఆడాడు’ అని కొనియాడాడు. భారత్‌తో జరుగుతున్న ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే నాలుగు టెస్టులు ముగియగా 33ఏళ్ల అలిస్టర్ కుక్ కనీసం ఒక్క మెరుగైన ఇన్నింగ్స్‌ కూడా ఆడలేకపోయాడు. ఈ కారణంగానే విమర్శలు రావడంతో అతను రిటైర్మెంట్ ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.