యాప్నగరం

కుక్ ద్విశతకంతో యాషెస్‌‌కి ఊపొచ్చింది..!

ఏకపక్షంగా సాగిపోతున్న యాషెస్ సిరీస్‌కి ఊపొచ్చింది. ఇప్పటికే వరుగా మూడు టెస్టులు ఓడి ఆతిథ్య ఆస్ట్రేలియాకి సిరీస్‌ని చేజార్చుకున్న

TNN 28 Dec 2017, 12:20 pm
ఏకపక్షంగా సాగిపోతున్న యాషెస్ సిరీస్‌కి ఊపొచ్చింది. ఇప్పటికే వరుగా మూడు టెస్టులు ఓడి ఆతిథ్య ఆస్ట్రేలియాకి సిరీస్‌ని చేజార్చుకున్న ఇంగ్లాండ్ నాలుగో టెస్టులో దుమ్మురేపుతోంది. ఓపెనర్ అలిస్టర్ కుక్ (226 నాటౌట్: 387 బంతుల్లో 23x4) డబుల్ సెంచరీ బాదడంతో ఆటలో మూడో రోజైన గురువారం మూడో సెషన్‌కి ఇంగ్లాండ్ 473/9తో నిలిచింది. అంతకముందు ఆస్ట్రేలియా జట్టు.. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (103) శతకం సాధించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకి ఆలౌటైంది. ప్రస్తుతం 146 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో ఇంగ్లాండ్ కొనసాగుతోంది.
Samayam Telugu alastair cook compiles record breaking double hundred during 4th ashes test
కుక్ ద్విశతకంతో యాషెస్‌‌కి ఊపొచ్చింది..!


పరిమిత ఓవర్ల క్రికెట్‌కి దూరంగా ఉంటూ.. కేవలం టెస్టులు మాత్రమే ఆడుతున్న అలిస్టర్ కుక్.. గత పది ఇన్నింగ్స్‌లోనూ చేసింది 37 పరుగులే. దీంతో అతను జట్టు నుంచి పక్కకి తప్పుకోవాలంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. కానీ.. ఓపికగా విమర్శలు విని ఊరుకున్న ఈ మాజీ కెప్టెన్.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీతో సమాధానమిచ్చాడు. కెరీర్‌లో కుక్‌కి ఇది ఐదో ద్విశతకం. మెల్‌బోర్న్ మైదానంలో ఓ విదేశీ బ్యాట్స్‌మెన్‌కి ఇదే అత్యధిక స్కోరు. 1984లో వివ్ రిచర్డ్స్ చేసిన 208 పరుగుల రికార్డుని.. తాజాగా కుక్ కనుమరుగు చేశాడు. గత ఏడాది పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ అజహర్ అలీ.. ఈ రికార్డు సమీపంలోకి వచ్చినా.. పాకిస్థాన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసేయడంతో అతను 205 పరుగుల వద్దే ఆగిపోయాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.