యాప్నగరం

లెక్కసరి.. రెండో టీ20లో వరల్డ్ ఎలెవన్‌ గెలుపు

తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన పాక్ ఆటగాళ్లు.. రెండో మ్యాచ్‌లో చేతులెత్తేశారు. బ్యాటింగ్‌లో రాణించినా బౌలింగ్‌లో సత్తాచాటలేకపోయారు.

TNN 14 Sep 2017, 8:56 am
తొలి మ్యాచ్‌లో అదరగొట్టిన పాక్ ఆటగాళ్లు.. రెండో మ్యాచ్‌లో చేతులెత్తేశారు. బ్యాటింగ్‌లో రాణించినా బౌలింగ్‌లో సత్తాచాటలేకపోయారు. హసీం ఆమ్లా, తిసార పెరీర ధనాధన్ బ్యాటింగ్‌తో అదరగొట్టారు. దీంతో బుధవారం లాహోర్‌లో జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో వరల్డ్ ఎలెవెన్ ఘన విజయం సాధించింది. ఇండిపెండెన్స్ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరిసీస్‌ను 1-1తో సమం చేసింది.
Samayam Telugu amla perera power world xi to 7 wicket win against pakistan
లెక్కసరి.. రెండో టీ20లో వరల్డ్ ఎలెవన్‌ గెలుపు


తొలుత టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ అహ్మద్ షెహజాద్ (43: 34 బంతుల్లో 5x4)తో పాటు బాబర్ అజామ్ (45: 38 బంతుల్లో 5x4), షోయబ్ మాలిక్ (39: 23 బంతుల్లో 1x4, 3x6) దూకుడుగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో పాక్ 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన వరల్డ్ ఎలెవెన్ ఓపెనర్ హసీం ఆమ్లా చెలరేగిపోయాడు. హాఫ్ సెంచరీ (72 నాటౌట్: 55 బంతుల్లో 5x4, 2x6)తో చివరి వరకు నిలిచాడు. మరోవైపు శ్రీలంక ఆల్‌రౌండర్ తిసారా పెరీర (47 నాటౌట్: 19 బంతుల్లో 5x6) సిక్సులతో హోరెత్తించాడు.

పాక్ నిర్ధేశించిన 175 లక్ష్యాన్ని మరో బంతి మిగిలి ఉండగానే వీరిద్దరూ ఛేదించారు. బౌలింగ్, బ్యాటింగ్‌లోనూ రాణించిన తిసార పెరీరకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. నిర్ణయాత్మక మూడో టీ20 శుక్రవారం లాహోర్ జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.