యాప్నగరం

అనుష్క శర్మ ఎప్పుడూ లేటే: విరాట్ కోహ్లి

భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తన ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు

TNN 4 Oct 2017, 3:38 pm
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తన ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. దీపావళి సందర్భంగా ఓ టీవీ ఛానల్ ప్రసారం చేయనున్న షో కోసం అమీర్ ఖాన్ అడిగిన ప్రశ్నలకి విరాట్ కోహ్లి సరదాగా సమాధానాలు చెప్పాడు. కోహ్లిని ఉడికించే ఉద్దేశంతో అమీర్ ఖాన్ కావాలనే అనుష్క శర్మతో బంధం గురించి చెప్పమనగా.. కెప్టెన్ నవ్వుతూ తమ ప్రేమాయణాన్ని బయటపెట్టాడు.
Samayam Telugu anushka sharma has made me a better person says virat kohli
అనుష్క శర్మ ఎప్పుడూ లేటే: విరాట్ కోహ్లి


‘అనుష్క శర్మ నిజాయతీ, కేరింగ్ నాకు చాలా బాగా నచ్చుతుంది. కానీ.. ఎప్పుడు కలవాలన్నా తను 5-7 నిమిషాలు ఆలస్యంగా వస్తోంటోంది. ఇది నాకు తనలో నచ్చని విషయం. అయితే.. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటాం. ఇంకా చెప్పాలంటే.. తను గత నాలుగేళ్లలో నన్ను ఒక వ్యక్తిగా చాలా మార్చింది’ అని కోహ్లి వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌ని భారత్ 4-1తో గెలిచిన విషయం తెలిసిందే. తొలి టీ20 మ్యాచ్ రాంచీ వేదికగా శనివారం జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.