యాప్నగరం

ఆస్ట్రేలియా ఓపెనర్ వార్నర్ సంచలన ప్రకటన

దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌లో బాల్ టాంపరింగ్‌కి పాల్పడి ఏడాది నిషేధానికి గురైన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంచలన ప్రకటన

Samayam Telugu 31 Mar 2018, 10:34 am
దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌లో బాల్ టాంపరింగ్‌కి పాల్పడి ఏడాది నిషేధానికి గురైన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంచలన ప్రకటన చేశాడు. నిషేధం తర్వాత మళ్లీ జట్టుకి ఆడే అవకాశమున్నా.. తాను రాజీనామా చేస్తున్నట్లు మీడియా సమావేశంలో ఉబికి వస్తున్న కన్నీరుతో వెల్లడించాడు. తీవ్ర అపవాదుల మధ్య శుక్రవారం రాత్రి స్వదేశానికి చేరుకున్న వార్నర్.. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో చర్చించిన తర్వాత తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం వేటుతో వార్నర్ ఐపీఎల్‌కి కూడా దూరమైన విషయం తెలిసిందే.
Samayam Telugu 63552990


దక్షిణాఫ్రికా గడ్డపై గత శనివారం టెస్టు మ్యాచ్ సందర్భంగా బౌలర్ బ్రాన్‌క్రాఫ్ట్‌ బాల్ టాంపరింగ్‌కి పాల్పడుతూ కెమెరాలకి చిక్కాడు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) విచారణ జరపగా.. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లకి ఇందులో పాత్ర ఉన్నట్లు తేలింది. దీంతో.. వార్నర్, స్మిత్‌‌లపై ఏడాది నిషేధం, బ్రాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం పడింది. ఇప్పటికే స్టీవ్‌స్మిత్, బెన్‌క్రాఫ్ట్‌ మీడియా సమావేశంలో తప్పు ఒప్పుకుని.. కన్నీటి పర్యంతమవుతూ క్రికెట్ అభిమానులకి క్షమాపణలు చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.