యాప్నగరం

అర్జున్ తెందుల్కర్.. సైలెంట్‌గా..?

క్రికెట్ శిక్షణకి ప్రపంచంలోనే అత్యత్తమ అకాడమీగా పేరొందిన ఇంగ్లాండ్‌లోని మెర్లిబోన్ క్రికెట్ క్లబ్‌

TNN 10 Jun 2017, 4:11 pm
మైదానంలో 24 ఏళ్లపాటు క్రికెట్ అభిమానుల్ని తన బ్యాటింగ్‌తో ఉర్రూతలూగించిన భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ కుమారుడు అర్జున్ తెందుల్కర్ అరంగేట్రంకి సైలెంట్‌గా రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే అర్జున్ తాను చదువుతున్న స్కూల్ జట్టు తరఫున ఓపెనర్‌గా బ్యాటింగ్ చేయడమే కాకుండా.. ఫాస్ట్ బౌలర్‌గానూ ఆకట్టుకుంటున్నాడు. గతంలో ముంబయి క్రికెట్ అసోషియేషన్ నిర్వహించిన అండర్-14 జట్టు సెలక్షన్స్‌లో అర్జున్ శతకం బాదేసిన విషయం తెలిసిందే.
Samayam Telugu arjun tendulkar bats in nets at lords
అర్జున్ తెందుల్కర్.. సైలెంట్‌గా..?


క్రికెట్ శిక్షణకి ప్రపంచంలోనే అత్యత్తమ అకాడమీగా పేరొందిన ఇంగ్లాండ్‌లోని మెర్లిబోన్ క్రికెట్ క్లబ్‌(ఎంసీసీ)‌లో అర్జున్ తెందుల్కర్ తాజాగా శిక్షణ తీసుకుంటున్నాడు. అక్కడ స్టోర్స్‌ నుంచి క్రీడా సామాగ్రి తీసుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. భారత్ అండర్-19 జట్టుకి ఎంపికవడమే లక్ష్యంగా ఈ 17 ఏళ్ల క్రికెటర్ కఠిన పద్ధతుల్లో శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Arjun Tendulkar busy honing Cricket skills at MCC.#CT17 @sachin_rt pic.twitter.com/rLn2KWdJTO — Krish Krish (@krishkrish200) June 9, 2017
‘అర్జున్ ఏమి కావాలనుకుంటున్నాడో తనే డిసైడ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చేశాను. ఎందుకంటే నా తల్లిదండ్రులు అలాంటి అవకాశాన్ని నాకివ్వడంతోనే నాకిష్టమైన రంగంలో రాణించగలిగాను. అదే విధంగా అర్జున్‌కి కూడా నేను అంతే స్వేచ్ఛ ఇవ్వాలని డిసైడయ్యా’ అని సచిన్ తెందుల్కర్ గతంలో స్పష్టం చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.