యాప్నగరం

టీ20ల్లో నెహ్రాకి అందుకే ఛాన్సిచ్చారు

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కి సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రాని సెలక్టర్లు ఎంపిక చేయడంపై మాజీ కెప్టెన్ సౌరవ్ స్పందించాడు

TNN 4 Oct 2017, 5:06 pm
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కి సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రాని సెలక్టర్లు ఎంపిక చేయడంపై మాజీ కెప్టెన్ సౌరవ్ స్పందించాడు. వయసు ఆధారంగా కాకుండా.. ప్రతిభ‌ని దృష్టిలో పెట్టుకుని ఎంపిక జరగడం ప్రశంసనీయమన్నాడు. 2019 ప్రపంచకప్ నేపథ్యంలో కుర్ర బౌలర్లకి అవకాశమిచ్చి ప్రోత్సహించకుండా.. 38 ఏళ్ల నెహ్రాకి ఛాన్స్ ఇవ్వడమేంటని అందరూ విమర్శిస్తున్న నేపథ్యంలో గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శనివారం రాంచీ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.
Samayam Telugu ashish nehra is an exceptional t20 bowler
టీ20ల్లో నెహ్రాకి అందుకే ఛాన్సిచ్చారు


‘నెహ్రా ఎంపిక భారత క్రికెట్‌కి శుభపరిణామం. సెలక్టర్లు వయసు‌‌‌తో సంబంధం లేకుండా ప్రతిభ ఆధారంగా జట్టుని ఎంపిక చేశారు. అతను టీ20ల్లో అద్భుతమైన బౌలర్. గత టీ20 ప్రపంచకప్‌లో అతని బౌలింగ్‌ని మనమంతా చూశాం. ఒక ఎడమచేతి వాటం పేస్ బౌలర్‌గా.. జట్టులో అతను ఈ టీ20 సిరీస్‌లో కీలకంగా మారనున్నాడు. జట్టులో నెహ్రా తప్పకుండా తనదైన ముద్ర వేస్తాడు’ అని గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. గాయం, ఫిటెనెస్ సమస్యలు కారణంగా గత ఎనిమిది నెలలుగా టీమిండియాకి నెహ్రా దూరంగా ఉన్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.