యాప్నగరం

శ్రీలంకపై బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్

టోర్నీలో సత్తాచాటడం ద్వారా పసికూన ముద్రని చెరిపేసుకోవాలని బంగ్లాదేశ్ ఉవ్విళ్లూరుతుండగా.. గాయాల కారణంగా జట్టులో ప్రధాన ఆటగాళ్లు ఎక్కువ మంది లేకుండానే శ్రీలంక బరిలోకి దిగుతోంది.

Samayam Telugu 15 Sep 2018, 5:16 pm
ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్ వేదిగకా శనివారం ఆరంభమైన తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో సత్తాచాటడం ద్వారా పసికూన ముద్రని చెరిపేసుకోవాలని బంగ్లాదేశ్ ఉవ్విళ్లూరుతుండగా.. గాయాల కారణంగా జట్టులో ప్రధాన ఆటగాళ్లు ఎక్కువ మంది లేకుండానే శ్రీలంక బరిలోకి దిగుతోంది.
Samayam Telugu DnIDm5kU0AADr1J


ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌తో పాటు హాంకాంగ్ టీమ్‌ కూడా పోటీపడుతోంది. భారత్ జట్టు తన తొలి మ్యాచ్‌ను హాంకాంగ్‌తో మంగళవారం ఆడనుండగా.. బుధవారం పాకిస్థాన్‌తో రెండో మ్యాచ్‌లో ఢీకొంటుంది. ఇప్పటికే భారత్ జట్టు ఆరుసార్లు ఆసియా కప్‌లో విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.