యాప్నగరం

పాక్‌కి ఆదిలోనే ఊహించని షాక్‌లిచ్చిన భువీ

గత ఏడాది ఛాంపియన్స్ ఫైనల్లో శతకంతో భారత్‌ని ఓడించడంలో కీలక పాత్ర పోషించిన మరో ఓపెనర్ ఫకార్ జమాన్ ఈ మ్యాచ్‌లో 9 బంతులాడి కనీసం పరుగుల ఖాతా కూడా తెరవలేకపోయాడు.

Samayam Telugu 19 Sep 2018, 5:29 pm
ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌‌లో భారత్‌కి శుభారంభం లభించింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేస్తుండగా.. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఆ జట్టుకి షాకిచ్చాడు. భువీ విసిరిన షార్ట్ పిచ్ బంతిని క్రీజు వెలుపలికి వచ్చి హిట్ చేసేందుకు ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (2: 7 బంతుల్లో) ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్ టాప్ ఎడ్జ్ తాకిన బంతి నేరుగా వెళ్లి వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ చేతుల్లో పడింది.
Samayam Telugu asia cup 2018 india vs pakistan bhuvneshwar provides early breakthrough
పాక్‌కి ఆదిలోనే ఊహించని షాక్‌లిచ్చిన భువీ


పాక్ జట్టు ఈ షాక్ నుంచి కోలుకునేలోపే మ్యాచ్ ఐదో ఓవర్‌లో మళ్లీ భువనేశ్వర్ ఆ జట్టుకి షాకిచ్చాడు. గత ఏడాది ఛాంపియన్స్ ఫైనల్లో శతకంతో భారత్‌ని ఓడించడంలో కీలక పాత్ర పోషించిన మరో ఓపెనర్ ఫకార్ జమాన్ ఈ మ్యాచ్‌లో 9 బంతులాడి కనీసం పరుగుల ఖాతా కూడా తెరవలేకపోయాడు. భువీ విసిరిన షార్ట్ పిచ్ బంతిని హిట్ చేసేందుకు అతను ప్రయత్నించగా.. ఎడ్జ్ తాకిన బంతిని గాల్లోకి లేచిపోయింది. దీంతో.. బౌలర్‌కి సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్న చాహల్ ఎలాంటి తడబాటు లేకుండా సులువుగా క్యాచ్‌ని అందుకున్నాడు. దీంతో.. 4.1 ఓవర్లు ముగిసే సమయానికి పాక్ 3/2తో ఒత్తిడిలో పడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.