యాప్నగరం

జాదవ్‌ స్పిన్‌ని పసిగట్టలేకపోయాం: పాక్ కెప్టెన్

మ్యాచ్ మధ్యలో బౌలింగ్ చేస్తూ గాయపడిన హార్దిక్ పాండ్య.. అనంతరం మైదానం వీడటంతో ప్రత్యామ్నాయంగా కేదార్ జాదవ్‌తో కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ చేయించాడు.

Samayam Telugu 20 Sep 2018, 6:34 pm
భారత్ ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్‌‌ని నిర్లక్ష్యం చేసి తాము మూల్యం చెల్లించుకున్నామని పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆసియా కప్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో 9 ఓవర్లు బౌలింగ్ చేసిన స్పిన్నర్ కేదార్ జాదవ్ 23 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ మధ్యలో బౌలింగ్ చేస్తూ గాయపడిన హార్దిక్ పాండ్య.. అనంతరం మైదానం వీడటంతో ప్రత్యామ్నాయంగా కేదార్ జాదవ్‌తో కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ చేయించాడు. దొరికిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్న జాదవ్.. మూడు వికెట్లతో పాక్‌ని కట్టడి చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించాడు.
Samayam Telugu asia cup 2018 prepared for kuldeep yadav yuzvendra chahal but kedar jadhav got to us sarfraz ahmed
జాదవ్‌ స్పిన్‌ని పసిగట్టలేకపోయాం: పాక్ కెప్టెన్


‘స్పిన్నర్లు కుల్దీప్, చాహల్‌ల బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు మేము ప్రాక్టీస్ చేశాం. కానీ.. కేదార్ జాదవ్‌ బౌలింగ్‌ని పసిగట్టలేక వికెట్లు సమర్పించుకున్నాం. జట్టులో బాబర్ అజామ్ మినహా అందరూ చెత్త షాట్లు ఆడే వికెట్లు చేజార్చుకున్నారు. తొలి ఐదు ఓవర్లలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయినా.. మధ్యలో పుంజుకునే అవకాశం మాకు దక్కింది. కానీ.. మళ్లీ కేదార్ జాదవ్ పాక్‌ని దెబ్బతీశాడు. ఏదిఏమైనా టోర్నీ ఆరంభంలోనే ఈ ఓటమి మా జట్టుకి ఓ హెచ్చరిక. తప్పిదాలు పున‌రావృతం కాకుండా జాగ్రత్తపడతాం’ అని సర్ఫరాజ్ అహ్మద్ వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.