యాప్నగరం

అఫ్గాన్‌తో మ్యాచ్‌లో బంగ్లా టార్గెట్ 256

జట్టు స్కోరు 150 వద్ద షాహిదీ ఔటవడంతో 150/6తో అఫ్గాన్‌ తక్కువ స్కోరుకే పరిమితయ్యేలా కనిపించినా.. ఆఖర్లో రషీద్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్‌తో గౌరవప్రదమైన స్కోరుని అందించాడు.

Samayam Telugu 20 Sep 2018, 9:03 pm
ఆసియా కప్‌లో భాగంగా గురువారం జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ టీమ్ 255 పరుగులతో బంగ్లాదేశ్‌కి సవాల్ విసిరింది. హిస్మతుల్లా (58: 92 బంతుల్లో 3x4), రషీద్ ఖాన్ (57: 32 బంతుల్లో 8x4, 1x6) అర్ధశతకాలతో చెలరేగడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్ షకీబ్ అల్ హసన్ 4/42 మాత్రమే బౌలింగ్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశాడు.
Samayam Telugu Abu Dhabi : Afghanistans Gulbadin Naib, left, and Rashid Khan cheer each other...
Afghanistan's Gulbadin Naib, left, and Rashid Khan cheer each other by touching the bats during the one day international cricket match of Asia Cup between Bangladesh and Afghanistan in Abu Dhabi, United Arab Emirates. AP/ PTI


అఫ్గానిస్థాన్ ఓపెనర్ జనాత్, కెప్టెన్ అస్గర్ (8), రెహ్మాత్ షా (10) నిరాశపరచడంతో మ్యాచ్ ఆరంభంలోనే మ్యాచ్‌పై బంగ్లాదేశ్ పట్టు సాధించేలా కనిపించింది. కానీ.. షాహిది, ఓపెనర్ షెజాద్ (37: 47 బంతుల్లో 4x4) కీలక ఇన్నింగ్స్ ఆడి మళ్లీ మ్యాచ్‌లోకి అఫ్గాన్‌కి తెచ్చారు. అయితే జట్టు స్కోరు 150 వద్ద షాహిదీ ఔటవడంతో 150/6తో అఫ్గాన్‌ తక్కువ స్కోరుకే పరిమితయ్యేలా కనిపించినా.. ఆఖర్లో రషీద్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్‌తో గౌరవప్రదమైన స్కోరుని అందించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.