యాప్నగరం

Asia Cup: వచ్చే ఏడాది శ్రీలంక ఆతిథ్యం.. 2022 ఎడిషన్ ఎక్కడంటే?

కరోనా కారణంగా 2020 ఆగస్టులో ప్రారంభం కావాల్సిన ఆసియా కప్.. మరుసటి ఏడాదికి వాయిదా పడింది. 2021లో శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుండగా.. 2021 ఎడిషన్‌కు పాక్ ఆతిథ్యం ఇవ్వనుంది.

Samayam Telugu 4 Dec 2020, 9:37 am
కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది జరగాల్సిన టీ20 వరల్డ్ కప్‌తోపాటు ఆసియా కప్ 2020 వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆసియా కప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా.. కోవిడ్ కారణంగా వాయిదా పడటంతో.. కొత్త షెడ్యూల్, వేదికల మార్పు విషయమై కొద్ది నెలలుగా చర్చిస్తున్నారు. ఈ ఏడాది జరగాల్సిన ఆసియా కప్‌ను 2022కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Samayam Telugu Asia-Cup-Trophy-Getty
(Getty Images)


కాగా 2021 జూన్‌లో శ్రీలంకలో ఆసియా కప్ నిర్వహిస్తారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ సీఈవో వసీం ఖాన్ వెల్లడించారు. ఆ తర్వాతి ఏడాది తమ దేశంలో ఆసియా కప్ నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

షెడ్యూల్ ప్రకారం 2020 ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లోనే ఆసియా కప్‌ను పాక్‌లో నిర్వహించాల్సి ఉంది. కానీ కోవిడ్ కారణంగా అది సాధ్యపడలేదు. దీంతో ఆసియా కప్‌ షెడ్యూల్ 2021 జూన్‌కు మార్చారు. వచ్చే ఏడాది ఆసియా కప్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుండగా.. 2022 ఎడిషన్‌ ఆతిథ్య హక్కులు పాక్‌కు దక్కాయి.

పాకిస్థాన్‌లో శ్రీలంక ఆటగాళ్లు ప్రయాణిస్తోన్న బస్సుపై ఉగ్రవాదుల దాడి ఘటన తర్వాత అంతర్జాతీయ జట్లు ఆ దేశానికి వెళ్లడానికి జంకుతున్నాయి. గత ఏడాది కాలంలో జింబాబ్వే, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు పాక్ గడ్డ మీద పర్యటించాయి.

భారత్‌తోపాటు కొన్ని ఇతర జట్లు పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడేందుకు సుముఖంగా లేవు. 2022లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పాక్‌లో పర్యటించేలా పీసీబీ ఒప్పించింది. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ జట్టు కూడా పాక్‌లో పర్యటించే అవకాశం ఉంది. 2006 తర్వాత ఇంగ్లిష్ జట్టు పాకిస్థాన్‌ పర్యటనకు వస్తుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

2020 ఆసియా కప్ వాయిదా పడక ముందు.. ఈ టోర్నీ కోసం పాకిస్థాన్‌ వెళ్లబోమని బీసీసీఐ తెలిపింది. పాక్ బదులుగా యూఏఈలో టోర్నీ నిర్వహించే దిశగా చర్చలు జరిపారు. 2022కు ఆసియా కప్ వాయిదా పడటంతో.. అప్పటికైనా బీసీసీఐ మనసు మార్చకుంటుందనే ఆశతో పీసీబీ ఉంది. భారత క్రికెట్ బోర్డు ఇదే పట్టుదలతో ఉంటే.. వేదిక యూఏఈకి మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.