యాప్నగరం

20ఏళ్ల తర్వాత ఫైనల్‌కి చేరిన భారత్ హాకీ

ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు అద్వితీయ ప్రదర్శనతో ఫైనల్లో అడుగుపెట్టింది. టోర్నీ

Samayam Telugu 29 Aug 2018, 9:03 pm
ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు అద్వితీయ ప్రదర్శనతో ఫైనల్లో అడుగుపెట్టింది. టోర్నీ ఆరంభం నుంచి అంచనాలు అందుకుంటూ.. జోరు కొనసాగిస్తున్న మహిళల టీమ్ ఈరోజు చైనాతో జరిగిన మ్యాచ్‌లో 1-0 తేడాతో గెలిచి తుది పోరు‌కి అర్హత సాధించింది. ఆసియా గేమ్స్‌లో 1998 తర్వాత భారత మహిళల హాకీ టీమ్ ఫైనల్‌కి చేరడం ఇదే తొలిసారి. జపాన్‌తో శుక్రవారం భారత్ జట్టు పసిడి పతకం కోసం ఫైనల్ ఆడనుంది.
Samayam Telugu 65596750


మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకూ భారత్ జట్టు దూకుడైన ఆటతో చైనాతో ఆడుకుంది. ఇరు జట్ల డిఫెన్స్ బలంగా ఉండటంతో మ్యాచ్ 52వ నిమిషం వరకూ కనీసం ఒక గోల్‌ కూడా నమోదవలేదు. అయితే.. ఈ దశలో గుర్జీత్ కళ్లు చెదిరే గోల్‌తో భారత్‌కి 1-0తో ఆధిక్యం అందించగా.. ఆ తర్వాత ఆధిక్యాన్ని సమం చేసేందుకు చివరి వరకూ చైనా ప్రయత్నించింది. కానీ.. ఫలితం లేకపోయింది.

1982 ఆసియా గేమ్స్‌లో పసిడి పతకం గెలుపొందిన భారత మహిళల హాకీ టీమ్.. ఆ తర్వాత 1998లో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా గేమ్స్‌లో రజత పతకాన్ని గెలుపొందింది. ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో భారత్ మహిళల టీమ్ అత్యుత్తమ ప్రదర్శన ఇదే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.