యాప్నగరం

భారత్ షూటర్ కారుని ఎత్తుకెళ్లిన దొంగలు

రెండేళ్ల క్రితం షూటర్ దీపక్ కుమార్ కారు అద్దాల్ని పగలగొట్టిన దొంగలు.. అందులో ఉన్న ఖరీదైన వస్తువుల్ని దొంగలించారు. తాజాగా అతని కారునే ఎత్తుకెళ్లిపోయారు.

Samayam Telugu 19 Feb 2020, 5:43 pm
భారత సీనియర్ షూటర్ దీపక్ కుమార్ కారుని దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. ఢిల్లీలోని తన బంధువుల వివాహ వేడుకకి హాజరైన దీపక్ కుమార్.. తన హోండా WR-V కారుని వీఐపీ పార్క్‌ వెలుపల పార్క్ చేశానని.. అయితే తిరిగొచ్చేసరికి కారు అక్కడ లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 2018లోనూ దీపక్ కారులో ఉంచిన ఖరీదైన వస్తువుల్ని దొంగతనం చేశారు.
Samayam Telugu Deepak Kumar


2018 ఆసియా గేమ్స్‌లో రజత పతకం గెలిచిన దీపక్ కుమార్.. ఈ ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌లో 10మీ ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో పోటీపడనున్నాడు. అందుకే తన దృష్టి మొత్తం ఇప్పుడు ఒలింపిక్స్‌పైనే ఉందన్న దీపక్.. కారు దొంగతనం గురించి ఎక్కువగా ఆలోచించడం లేదని చెప్పుకొచ్చాడు. అయితే.. కారు కనిపించకపోయిన వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేసినా.. వారు సరిగా స్పందించలేదని ఈ షూటర్ ఆరోపించాడు.

‘ప్రపంచకప్‌ కోసం ఢిల్లీలో మార్చి 15 నుంచి ప్రాక్టీస్ మొదలెట్టబోతున్నాను. టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తా. అయితే.. ఇలాంటి విషయాలు (కారు దొంగతనం) నా ఏకాగ్రతని ఏమాత్రం దెబ్బతీయలేవు. కానీ. నాకే ఎందుకు ఇలా జరుగుతుందో..? అర్థం కావడం లేదు’ అని దీపక్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.