యాప్నగరం

ఆస్ట్రేలియా 300లకు ఆలౌట్!

నాలుగో టెస్టులో భారత బౌలర్లు సత్తా చాటారు. తొలి సెషన్‌లో దూకుడైన ఆటతీరుతో ఆధిపత్యం నిలుపుకొని..

TNN 25 Mar 2017, 4:46 pm
నాలుగో టెస్టులో భారత బౌలర్లు సత్తా చాటారు. తొలి సెషన్‌లో దూకుడైన ఆటతీరుతో ఆధిపత్యం నిలుపుకొని భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతుందనుకున్న ఆసిస్‌ను 300లకే కట్టడి చేశారు. చివరి రెండు సెషన్లలో మనవాళ్లు అద్భుతమే చేశారు. 88వ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ వేసిన బంతిని నాథన్ లైయన్ క్యాచ్ ఇవ్వగా పుజారా ఒడిసిపట్టుకోవడంతో ఆసిస్ మొదటి ఇన్నింగ్స్‌కు తెరపడింది.
Samayam Telugu astralia all out for 300
ఆస్ట్రేలియా 300లకు ఆలౌట్!


లంచ్ విరామ సమయానికి వికెట్ నష్టానికి 131 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచిన ఆస్ట్రేలియా జట్టు.. టీ విరామ సమయానికి 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసిందంటే.. మన బౌలర్లు ఏ స్థాయిలో రాణించారో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద భారత బౌలర్లు సమష్టిగా రాణించారు. కోహ్లీ స్థానంలో జట్టులోకి వచ్చిన కుల్‌దీప్ యాదవ్ 4 కీలక వికెట్లు తీసి అద్భుతమైన ప్రదర్శన చేయడం ద్వారా ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లు తొలి రోజే ఆసిస్ పతనాన్ని శాసించడం గమనార్హం. ఇక మిగిలింది.. మన బ్యాట్స్‌మన్ మెరుగ్గా రాణించి ఆసిస్ ముందు భారీ స్కోర్ నిలపడమే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.