యాప్నగరం

పాక్‌ బౌలర్‌కి 6,4,4Nb,6,0,4,1‌తో ఫించ్ చుక్కలు

పాకిస్థాన్ టీ20 జట్టులోకి చాలా రోజుల తర్వాత వచ్చిన మహ్మద్ ఇర్ఫాన్‌కి తొలి టీ20లోనే అరోన్ ఫించ్ పీడకలల్ని మిగిల్చాడు. వర్షం వచ్చే సూచనలు కనిపించడంతో ఒకే ఓవర్‌లో భారీగా పరుగులు రాబట్టేశాడు.

Samayam Telugu 4 Nov 2019, 3:37 pm
పాకిస్థాన్‌ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఇర్ఫాన్‌కి భారీ షాట్లతో ఆస్ట్రేలియా ఓపెనర్ అరోన్ ఫించ్ చుక్కలు చూపించాడు. సిడ్నీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 119 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా జట్టు.. అరోన్ ఫించ్ (37 నాటౌట్: 16 బంతుల్లో 5x4, 2x6) జోరుతో 3.1 ఓవర్లలోనే 41/0తో తిరుగులేని స్థితిలో నిలిచింది. అయితే.. ఈ దశలో వర్షం రావడంతో మ్యాచ్‌ని అంపైర్లు రద్దు చేశారు.
Samayam Telugu Mohammad Irfan, Aaron Finch
Mohammad Irfan, Aaron Finch



వర్షం కారణంగా తొలుత మ్యాచ్‌ని 15 ఓవర్లకి కుదించగా.. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 5 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. అయితే.. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఆస్ట్రేలియా టార్గెట్‌ని 119 పరుగులుగా నిర్ణయించారు. దీంతో.. మళ్లీ వర్షం పడే సూచనలు కనిపించడంతో ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా ఆరంభం నుంచి దూకుడుగా ఆడే ప్రయత్నం చేసింది.

ఈ క్రమంలో ఇన్నింగ్స్‌ మూడో ఓవర్ వేసిన మహ్మద్ ఇర్ఫాన్ బౌలింగ్‌లో ఆకాశమే హద్దుగా అరోన్ ఫించ్ చెలరేగిపోయాడు. ఆ ఓవర్‌ తొలి బంతినే సిక్స్‌గా మలిచిన ఫించ్.. ఆ తర్వాత వరుసగా రెండు ఫోర్లు, ఒక సిక్స్, మళ్లీ ఒక ఫోర్ బాదేసి మొత్తంగా 26 పరుగులు రాబట్టాడు. ఈ ఓవర్‌లోనే ఒక నోబాల్ కూడా పడటం ఫించ్‌కి కలిసొచ్చింది. కానీ.. వర్షం ఆస్ట్రేలియా విజయాన్ని అడ్డుకుంది. కనీసం 5 ఓవర్లు ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసి ఉన్నా.. మ్యాచ్ ఫలితం తేలేది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.